తెరమీదికి మూడోఫ్రంట్: కాంగ్రెస్‌కు షాక్, థర్డ్‌ఫ్రంట్‌లో పవన్‌, ఎవరికి లాభం?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌ ఎపిసోడ్ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు కన్పిస్తున్నాయి. అయితే టిఆర్ఎస్‌ను తాము డీకొట్టామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సిపిఎం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో మూడో ఫ్రంట్ ‌కూడ ఎన్నికల బరిలోకి దిగనుంది.అయితే మూడో ఫ్రంట్‌ ఎన్నికల బరిలోకి దిగడం కాంగ్రెస్ పార్టీకి నష్టం కల్గించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. విపక్ష పార్టీల ఓట్లు చీలి అధికార పార్టీకి కలిసొచ్చే అవకాశాలు కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వారిద్దరు కలిశారు: ''సుఖేందర్‌రెడ్డే నా గురువు, కానీ, కోమటిరెడ్డిపై వ్యతిరేకతతోనే చేరలేదు''

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటి నుండి రాజుకొంది. రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో నూతనోత్తేజం కన్పిస్తోంది. ఈ తరుణంలో టిడిపికి చెందిన క్యాడర్‌ను నేతలను కాంగ్రెస్‌ పార్టీ ఆకర్షిస్తోంది.

సన్నిహితులు కూడ రేవంత్‌కు షాక్: టిక్కెట్ల చిక్కులు, కారణమదేనా

టిడిపికి చెందిన ముఖ్య నేతలను కాంగ్రెస్‌తో పాటు టిఆర్ఎస్‌ నేతలు కూడ వల విసురుతున్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ ఉంటుందా అనే వాతావరణాన్ని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

టిటిడిపి దారెటు: వెల్‌కం ఖాయమేనా, పొత్తులపై బాబు వ్యూహత్మక మౌనం?

 2019 ఎన్నికల్లో మూడో ఫ్రంట్‌ పోటీ

2019 ఎన్నికల్లో మూడో ఫ్రంట్‌ పోటీ

2019 ఎన్నికల్లోకాంగ్రెస్, టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పార్టీలను, వ్యక్తులను, సంఘాలను ఐక్యం చేసి మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సిపిఎం తెలంాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ మద్య ముఖాముఖి పోటీ ఉంటుందనే నేపథ్యంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు

 పవన్‌కళ్యాణ్‌తో చర్చలు

పవన్‌కళ్యాణ్‌తో చర్చలు

రాష్ట్రస్థాయిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు తాజాగా నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ ఫ్రంట్‌లో అన్ని వామపక్షపార్టీలు, సామాజిక సంస్థలు, మేధావులు, కళాకారులను కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. ఇందుకోసం ప్రొఫెసర్‌ కోదండరాం, జస్టిస్‌ చంద్రకుమార్, పవన్‌ కల్యాణ్‌ తదితరులతో చర్చలు జరుపుతున్నట్టు తమ్మినేని వీరభద్రం చెప్పారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో ఫ్రంట్ పోటీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో ఫ్రంట్ పోటీ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ మూడో ఫ్రంట్ పోటీచేసేందుకు రంగం సిద్దం చేసినట్టు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఈ సమావేశాల తర్వాత బస్సు యాత్రలు నిర్వహిస్తామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడో రాజకీయ కూటమి ద్వారానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రానున్న సాధారణ ఎన్నికలను సైతం ఎదుర్కొంటామని తమ్మినేని స్పష్టం చేశారు.

 ఓట్ల చీలిక టిఆర్ఎస్‌కు ప్రయోజనమేనా?

ఓట్ల చీలిక టిఆర్ఎస్‌కు ప్రయోజనమేనా?

2019 ఎన్నికల్లో విపక్షాల మధ్య ఓట్ల చీలిక టిఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాల మధ్య ఓట్ల చీలిక లేకుండా జాగ్రత్తలు తీసుకొంటేనే అధికార పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులుంటాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో విపక్షాల మధ్య ఓట్ల చీలిక లేకుండా జాగ్రత్తలు తీసుకొంటారా లేదా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.ముఖాముఖి పోటీ జరిగితేనే టిఆర్ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే 2004, 2009 ఎన్నికల సమయంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూడ కూటమిగా పోటీచేసిన సందర్బాలను రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CPM state secretary Tammineni Veerabhadram said that we will form third front for 2019 elections.We are talking with Pawan kalyan, justice Chandrakumar and Kodandaram he said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి