వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతిరాత పరిశీలన, నాలుగోరోజు ప్రశ్నల వర్షం : రవిప్రకాశ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్ రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీవీ9 కంపెనీలో ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో పోలీసులు కీలక ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రశ్నల వర్షం ..
టీవీ9 సంస్థలో ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో గత రోజులుగా సీసీఎస్ పోలీసులు రవిప్రకాశ్‌ను విచారిస్తున్నారు. అయితే ఇవాళ్టి విచారణలో కూడా రవిప్రకాశ్ పోలీసులకు సహకరించలేదు. చెప్పిన సమాధానాలే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతోపాటు యాజమాన్యం మారిన తర్వాత టీవీ9 లోగో కొత్త మేనేజ్ మెంట్ కు దక్కకుండా రవిప్రకాశ్ కుట్రపన్నారు. లోగో అక్రమంగా విక్రయించే కుట్రపన్నారు. దీనిపై అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇవాళ ఈ కేసు విచారణకు కూడా రవిప్రకాశ్ హాజరయ్యారు. టీవీ9 లోగోను సీఈవో స్థాయిలో ఉన్నవ్యక్తి ఎలా విక్రయించాలనుకున్నారని .. లోగో అమ్మేయాలనుకుంటే యాజమాన్యానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతోపాటు సీసీఎస్ పోలీసులు తమ విచారణను వీడియో రికార్డింగ్ కూడా చేశారు.

will be arrest ravi prakash ?

చేతిరాత పరిశీలన ..
దీంతోపాటు రవిప్రకాశ్ కు పెన్ను, పేపర్ కూడా ఇచ్చి చూసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అతడు పేపర్ పై రాసిన విధానాన్ని బట్టి మానసిక స్థితిని, చేతిరాతను పరిశీలించి అంచనా వేశారు. ఫోర్జరీ విషయంలో రవిప్రకాశ్ చేతిరాతను కూడా సేకరించారు. దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపించిచారు. దీంతోపాటు తాము నోటీసులు ఇచ్చాకా .. ఇన్నిరోజులు ఎక్కడ తలదాచుకున్నావని రవిప్రకాశ్‌ను పోలీసులకు సమాచారం లభించినట్టు తెలిసింది.

English summary
TV9 former CEO Ravi Prakash's arrest seems to be ready. The police have provided key evidence in the case of forgery case in TV9. It is credible that the police have been advised by the lawyers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X