వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి వెంకట్రామి రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తారా.?కేసీఆర్ వైఖరి అవమానకరంగా ఉందన్న రేవంత్ రెడ్డి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై మరోసారి విరుచుకుపడ్డారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అందలం ఎక్కుతున్నారు, సీఎం హోదాలో చంద్రశేఖర్ రావు ఎవరికి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డి లాంటి అవనీతి పరుడికి చట్ట సభల్లో అవకాశం కల్పించి ప్రజాస్వామ్యాన్ని అవమానించారని సీఎం చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు. మల్లన్న సాగర్ ముంపు బాదితుల నష్టపరిహారం చెల్లింపు అంశంలో వెంకట్రామి రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ బహిర్గతం చేసి న్యాయపోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్.. న్యాయపోరాటం చేస్తామన్న పీసిసి

వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్.. న్యాయపోరాటం చేస్తామన్న పీసిసి

అంతే కాకుండా వెంకట్రామి రెడ్డి హయాంలో భూముల అమ్మకాల విషయంలో అక్రమాలు జరిగాయని, హైదరాబాద్ మెట్రో డెవెలప్ మెంట్ అథారిటీలో వెంకట్రామిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.ఐనప్పటికి సంబందిత అధికారులనుండి స్పందన లేదని, పదవిలో ఉన్న లో వున్న ఇలాంటి అవినీతి అధికారులపై విచారణ చేయాలని, వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ రావు అవకాశం ఇచ్చారని, ఇక రేపో మాపో ఆర్ధిక శాఖను కూడా కట్టబెడతారనే ప్రచారం జరుగుతుందని రేవంత్ ఆరోపించారు. అవినీతి అధికారులను పాలకులుగా నియమించి తెలంగాణకు చంద్రశేఖర్ రావు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణ వాదులకు అన్యాయం.. కేసీఆర్ వైఖరి పట్ల రేవంత్ ఆగ్రహం

తెలంగాణ వాదులకు అన్యాయం.. కేసీఆర్ వైఖరి పట్ల రేవంత్ ఆగ్రహం

అంతే కాకుండా గత కొన్ని రోజులుగా అధికారాన్ని అడ్డంపెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘింస్తూ తెలంగాణ రైతాంగాన్ని అనేక ఇబ్బందులకు గురిచేసారని వెంకట్రామి రెడ్డిపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వెంకట్రామి రెడ్డి లాంటి వ్యక్తులను అందంలం ఎక్కిస్తూ రాష్ట్రాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తున్నారని ఘాటుగా స్పందించారు. 1994 లో గ్రూప్ -1 అధికారిగా సెలెక్ట్ ఐన వెంకట్రామి రెడ్డి చంద్రబాబు అశిస్తులతో కుప్పంలో పని చేసారని అక్కడ కూడా అవినీతి అక్రమాలకు సైతం పాల్పడ్డాడని పేర్కొన్నారు. తర్వాత కాంగ్రెస్ హయాంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుడా సెక్రెటరీగా ఔటర్ రింగురోడ్డు వంకర్లు టింకర్లు తిప్పి రైతులను ముంచిన అధికారి వెంకట్రామి రెడ్డి అని మండిపడ్డారు.

గతంలో ఫిర్యాదు చేసాం.. చర్యలు మాత్రం లేవన్న టీపిసిసి

గతంలో ఫిర్యాదు చేసాం.. చర్యలు మాత్రం లేవన్న టీపిసిసి

ఇదిలా ఉండగా సిరిసిల్ల, సిద్ది పేట ఉమ్మడి మెదక్ కలెక్టర్ గా ప్రజలను, రైతులను పచ్చి మోసం చేసిన వెంకట్రామి రెడ్డి కి రాజకీయ అవకాశం కల్పిండం ముమ్మాటికీ తప్పేనన్నారు రేవంత్ రెడ్డి. అవినీతి పరుడైన వెంకట్రామి రెడ్డి పై రాష్ట్ర పతికి కూడా పిర్యాదు చేసినట్టు తెలిపారు. రాష్ట్రపతి నుండి సీఎస్ కు చర్యలు తీసుకోమని లేఖ వచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి సహకారంతో ఒత్తిడి లేకుండా చూసుకున్నారని, వెంకట్రామి రెడ్డిపై న్యాయపరంగా పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకాడబోదని రేవంత్ రెడ్డి తెలిపారు.

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS
వెంకట్రామిరెడ్డిది అక్రమ ఎంపిక.. ఎమ్మెల్సీ పదవిని అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతలు

వెంకట్రామిరెడ్డిది అక్రమ ఎంపిక.. ఎమ్మెల్సీ పదవిని అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతలు

అంతే కాకుండా బుదవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై పిర్యాదు చేస్తామని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసారు. దీంతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్వర్యంలో ఎమ్మెల్యే లు, ఎంపి లు, ఎమ్మెల్సీ లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కలిసి ఎన్నికల అధికారికి పిర్యాదు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పై అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల చేత ఫిర్యాదులు, భూ కబ్జాలు తదితర ఆరోపణల నేపథ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయబోతున్నట్టు మమేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసారు.

English summary
CM Chandrasekhar Rao was incensed that he had insulted democracy by giving a chance to a corrupt person like Venkatrami Reddy in the legislature.Pcc chief Revant Reddy Fired On Kcr once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X