వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్క్ డన్.!అంతా ఆయనే చేసాడు.!ఆ విషయంలో కేసీఆర్ సక్సెస్.!రాష్ట్రంలో ఆ పార్టీ ఊసే లేదుగా.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కసాయి శత్రువు కన్నా ప్రియమైన ప్రత్యర్థితో అంత ఘోరమైన ప్రమాదం ఉండదు. అన్ని బలహీనతలు తెలిసి మిత్రుడి కన్నా ఏ రహస్యం తెలియని శత్రువుతో పెద్దగా హాని ఉండదు. నమ్మిన వాణ్ని ఒప్పించడంలో ఉన్న వెసులుబాటు విభేదిస్తున్న వాడితో అంత సాద్యం కాకపోవచ్చు. ఒక వ్యవస్థ గురించి ఎంత చెప్పినా ప్రజల్లో స్పందన లేనప్పుడు ఆ అంశాన్ని పదే పదే ఊటంకించడంలో లోతైన అర్ధం ఉండక మానదు. ఈ సూత్రాన్ని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి స్థాయిలో విశ్వశిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రతిపక్ష పార్టీల పట్ల వినూత్న వ్యూహ రచనతో ముందడుగు వేయడంలో విజయం సాధించారు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు.

 కసాయి శత్రువు కన్నా ప్రియమైన శత్రువు బెటర్.. కేసీఆర్ వ్యూహం కూడా అదే

కసాయి శత్రువు కన్నా ప్రియమైన శత్రువు బెటర్.. కేసీఆర్ వ్యూహం కూడా అదే

తెలంగాణ కల సాకారం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజానికంలో కాస్తో కూస్తో సానుకూల దృక్పదం ఉంది. ఈ దృక్పదం ముదిరినా, బలపడినా క్షేత్ర స్ధాయిలో ఊహించని ప్రమాదం పొంచి ఉందన్న అంశాన్ని సీఎం చంద్రశేఖర్ రావు పసిగట్టారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల జరుగుతున్న పరిణామాలను గ్రహించి, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన పార్టీగా తెలంగాణ ప్రజల ముందు సాక్షాత్కరింపజేయడంలో అప్రతిహతంగా ముందడుగువేసి అజేయ విజయాన్ని అందుకున్నారు చంద్రశేఖర్ రావు.

 కేసీఆర్ చాణక్యం..కాంగ్రెస్ గురించి ప్రస్ధావిస్తే ప్రమాదం.. బీజేపి గురించి ప్రస్థావించకపోతే ప్రమాదం.

కేసీఆర్ చాణక్యం..కాంగ్రెస్ గురించి ప్రస్ధావిస్తే ప్రమాదం.. బీజేపి గురించి ప్రస్థావించకపోతే ప్రమాదం.

సీఎం స్దాయిలో ఏ అంశం గురించి ప్రస్తావించినా అది ఊహించని విధంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లో తారా స్థాయిలో చర్చనీయాంశమవుతుంది. అదే చర్చ ఎక్కడో మనసు ఆంతర్యంలో మిణుకు మిణుకు మంటున్న సానుభూతికి ఆజ్యంపోసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రజాదరణ ఎప్పటికైనా తప్పదనుకున్న తరుణంలో అత్యంత చాకచక్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదనే భ్రమలను కల్పించి, ప్రజలతో నమ్మించేందుకు కీలక అడుగులు వేస్తున్నారు. అందులో మొదటి అడుగు భారతీయ జనతా పార్టీ గురించి, ఆ పార్టీ అద్యక్షుడు గురించి పరిమితికి మించి ప్రస్థావించడాన్ని చంద్రశేఖర్ రావు ఓ అస్త్రంగా మార్చుకున్నారు.

 కాంగ్రెస్ ఉరికి లేదు.. ప్రజలను నమ్మించేందుకు కేసీఆర్ వినూత్న వ్యూహం

కాంగ్రెస్ ఉరికి లేదు.. ప్రజలను నమ్మించేందుకు కేసీఆర్ వినూత్న వ్యూహం


భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా ప్రజల్లో సీరియస్ నెస్ రాదని గ్రహించినప్పుడు, ఆ పార్టీ గురించి తనకు ఎలాంటి ముప్పు ఉండదని నిర్దారించుకున్నప్పుడు చంద్రశేఖర్ రావు లాంటి మాటల మాంత్రికుడికి ఆకాశమే హద్దుగా పరిణమిస్తుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా అదే అంశాన్ని నిర్దారిస్తున్నాయి. విత్తనాలతో మొదలైన వివాదం అత్యంత వింతగా రూపాంతరం చెందింది. అదే వివాదాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికార గులాబీ పార్టీ, ప్రతిపక్ష హోదాలో బీజేపి ఉందన్న కలరింగ్ ఇవ్వడంలో చంద్రశేఖర్ రావు దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు.

 యస్.. వర్క్ డన్..! ఆ అంశంలో సీఎం సక్సెస్..

యస్.. వర్క్ డన్..! ఆ అంశంలో సీఎం సక్సెస్..


రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టిన దగ్గరనుండి సీఎం చంద్రశేఖర్ రావు తన వ్యూహాలకు మరింత పదునుపెంచినట్టు తెలుస్తోంది. తనతో సహా తన అనుయాయులను పూర్తి స్దాయిలో అప్రమత్తంగా వ్యవహరించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లో ఐనా, బయట ఐనా, పెళ్లిలో ఐనా, చావులో ఐనా, ప్రజల్లో ఐనా, ప్రగతిభవన్ లో ఐనా, ఎన్నికల్లో ఐనా ఉప ఎన్నికల్లో ఐనా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఊసెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. యథా రాజా తథా ప్రజా అనే నానుడి ముందునుండే ఉంది కాబట్టి ప్రజానికాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగా కూడా లేదనే నమ్మించే ప్రయత్నం చేయడంలో విజయం సాధించారు సీఎం చంద్రశేఖర్ రావు. యస్.. వర్క్ డన్.. ఆ అంశంలో సీఎం సక్సెస్.!

English summary
They are taking crucial steps to create illusions that the Congress party does not exist in the state and make them believe with the people. Chandrasekhar Rao turned the first step into a weapon by talking about the Bharatiya Janata Party and its president beyond the limit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X