ఏంటీ మెంటల్ హెరాస్మెంట్ ? తెలంగాణ పోలీసులపై ఎన్టీవీ యాంకర్ దేవి ఫైర్..!
తెలంగాణ మంత్రికీ, ఓ మహిళా ఐఏఎస్ అధికారికీ లింకులున్నాయంటూ కథనాలు ప్రసారం చేసిన వ్యవహారంలో ఎన్టీవీ జర్నలిస్టుల్ని హైదరాబాద్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేళ తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టుల్ని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. ఇదే క్రమంలో పోలీసుల తీరుపై ఎన్టీవీ జర్నలిస్ట్ దేవి కూడా ఫైర్ అయ్యారు.
మహిళా ఐఏఎస్ పై ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని న్యూస్ లో చదివాననే కారణంతో తనను నిర్బంధించడం, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబాడి పోలీసులు దాడులు చేయడంపై యాంకర్ దేవి ఫైర్ అయ్యారు. మహిళా జర్నలిస్టు అని మర్చిపోయి పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. ఈ కథనానికీ తన కుటుంబానికీ సంబంధం ఏంటన్నారు. నిన్న ఎన్టీవీ జర్నలిస్టులపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేవి ఓ వీడియో విడుదల చేశారు.

తెలంగాణ పోలీసులపై NTV మహిళా జర్నలిస్ట్ దేవీ ఆగ్రహం
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026
నేను కేవలం వార్త చదివాను.. ఏ వార్త వచ్చినా అది నేను చదువుతాను
నా వృత్తి ధర్మంలో భాగంగానే వచ్చిన వార్తను చదివాను
3 గంటల పాటు నన్ను విచారించారు.. నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉన్నా సమాధానాలు చెప్పాను
నిన్న వాళ్లు అడిగిన అన్ని… pic.twitter.com/Oy79OEYMY7
ఎన్టీవీలో ప్రసారమైన వివాదాస్పద కథనంపై ఆ ఛానల్ ఇప్పటికే క్షమాపణలు కోరింది. అయినా పోలీసులు ఛానల్ కు చెందిన ఓ మహిళా న్యూస్ ప్రజెంటర్ తో పాటు ముగ్గురు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాత్రం వారు తప్పించుకునేందుకు ప్రయత్నించడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. విచారణకు వస్తామని చెప్పి సెల్ ఫోన్ లు స్విచాఫ్ చేసుకున్నందుకే ఇలా ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications