వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ గజదొంగ.. రాష్ట్రాన్నే పాలించటం రాదు.. ఢిల్లీ రాజకీయాలా: వైఎస్ షర్మిల ఫైర్

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ను గజదొంగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులలో ముంచారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు, బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.

కేసీఆర్ కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తాడు

కేసీఆర్ కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తాడు

ఏ ఊరికి వెళ్లినా, ఎవ‌రిని క‌లిసినా వైయ‌స్ఆర్ పాల‌న మ‌ళ్లీ రావాల‌ని ప్రజలు కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు వైయస్ షర్మిల. కెసిఆర్ మాట‌ల పాల‌న‌, మ‌భ్య పెట్టే పాల‌న‌ను అంత‌మొందించేందుకు ప్ర‌జ‌లంతా ఏకం కావాలని షర్మిల పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డు కానీ కొత్త హామీల‌తో మ‌ళ్లీ మోసం చేయాల‌ని చూస్తున్నాడని వైయస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని సరిగా పాలించలేని కెసిఆర్ కు ఢిల్లీ రాజకీయాలపై ఆశ పుట్టుకొచ్చిందని వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

సమయం మీరు చెప్తారా ? నన్ను చెప్పమంటారా .. వైఎస్ షర్మిల సవాల్

సమయం మీరు చెప్తారా ? నన్ను చెప్పమంటారా .. వైఎస్ షర్మిల సవాల్

మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించినందుకు తనపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఈ విషయంపై మాట్లాడే దమ్ముంటే తనను అసెంబ్లీకి పిలవాలని వైఎస్ షర్మిల విసిరారు. సమయం మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? అసెంబ్లీ లోపలికి రావాలా? అసెంబ్లీ ముందుకు రావాలా? అందరి ముందు మాట్లాడదామా? అంటూ వైఎస్ షర్మిల చాలెంజ్ చేశారు. నిరంజన్ రెడ్డి తనను మరదలిని సంపాదించుట ఎంత వరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు.

ఆ ఎమ్మెల్యేలు మనుషులా? మృగాలా?

ఆ ఎమ్మెల్యేలు మనుషులా? మృగాలా?


అంతేకాదు షాద్ నగర్ కు ముగ్గురు ఎమ్మెల్యేలట. ఆరు చేతుల్లో సంపాదిస్తున్నారట. వీళ్ల దౌర్జన్యాలకు సామాన్యులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారట అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై మరోమారు విరుచుకుపడ్డారు. వీళ్లు మనుషులా? మృగాలా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తప్పులేదట.. ప్రజల పక్షాన నిలదీస్తే మాత్రం తప్పు అట. ఈ ఎమ్మెల్యేలకు హామీలు నెరవేర్చడం చేతకాదు కానీ స్పీకర్ కు వెళ్లి కంప్లయింట్ ఇవ్వడం మాత్రం చేతనైంది. వైయస్ రాజశేఖర రెడ్డి బిడ్డ దేనికీ భయపడదు. ఏ విచారణకైనా నేను సిద్ధం అని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.

కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ ఏమైంది ?

కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ ఏమైంది ?

అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కేసీఆర్.. ఆ హామీని గాలికొదిలేశాడు. ముస్లింలు పేదరికంలో ఉన్నారని ఆలోచించి, వారికి 4శాతం రిజర్వేషన్ అమలు చేసి, ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత వైయస్ఆర్ కే దక్కుతుందని వైయస్ షర్మిల గుర్తు చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చి, ఆశీర్వదించిన షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వైఎస్ షర్మిల వైయస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డపై మీరు చూపించిన ప్రేమానురాగాలు మర్చిపోలేనివని ప్రజలను కొనియాడారు. వైయస్ఆర్ తరహాలోనే రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వచ్చే ఎన్నికలలో తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

English summary
YS Sharmila came under fire saying that KCR is a robber, and KCR cannot rule the state..but he wants to do Delhi politics. YS Sharmila was fired saying that Shad Nagar has three MLAs and they are committing atrocities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X