వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీకే అరుణ కాదు కేడీ అరుణ..గద్వాలకు ఏం చేశావో చెప్పు: వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె తనదైన శైలిలో స్థానిక నాయకుల పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ ని టార్గెట్ చేసిన వైయస్ షర్మిల తెలంగాణ కోసం వైఎస్ఆర్ కుటుంబ ఏం చేసిందని డీకే అరుణ అడుగుతున్నారని, అసలు గద్వాల ప్రజల కోసం మీరేం చేశారో చెప్పాలని తిరిగి ప్రశ్నించారు.

డీకే అరుణను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

డీకే అరుణను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల


వైయస్ఆర్ మంత్రి పదవి ఇస్తేనే కదా డీకే అరుణమ్మకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది అని పేర్కొన్న వైయస్ షర్మిల వైయస్ఆర్ తర్వాత ఇన్నేండ్లుగా రాజకీయాల్లో ఉండి, గద్వాలకు డీకే అరుణమ్మ ఏం చేశారు? అంటూ నిలదీశారు. వైయస్సార్ బిడ్డకు తెలంగాణలో ఏం పని అని డీకే అరుణ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం వైయస్ షర్మిల స్పందించారు. తాను వైయస్సార్ బిడ్డనని, తెలంగాణ గడ్డ మీద పెరిగానని, ఇక్కడే చదువుకోవడం తో పాటు తన బిడ్డకు కూడా జన్మనిచ్చానని వైయస్ షర్మిల వెల్లడించారు. తన బ్రతుకు తన గతం ఇక్కడేనని పేర్కొన్న ఆమె తెలంగాణలో వైఎస్సార్ పాలన లేదు కాబట్టే తను పార్టీ పెట్టాను అని స్పష్టం చేశారు.

 కేడీ అరుణ అని బీజేపీ నాయకులే చెప్తున్నారు

కేడీ అరుణ అని బీజేపీ నాయకులే చెప్తున్నారు

అసలు డీకే అరుణను రాజకీయంగా పైకి తీసుకు వచ్చింది వైయస్సార్ కాదా అని ప్రశ్నించారు వైయస్ షర్మిల. వైయస్ఆర్ బిడ్డ తెలంగాణ రాజకీయాలకు రావడం అరుణకు నచ్చనట్టు ఉంది అంటూ సెటైర్లు వేశారు. 2018 లో బిజెపి నాయకుడు ఒకరు ఇక్కడ చేపట్టిన పనులన్నీ వాళ్ళవే అన్నారని, ఆయన అన్నట్టు గా పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్ సహా ప్రాజెక్టుల కమిషన్లు తీసుకున్నది వాళ్లే అంటూ సెటైర్లు వేశారు. ఇక డికే అరుణ కాదు కేడి అరుణ వైయస్ షర్మిల డీకే అరుణ ని టార్గెట్ చేశారు. ఇక ఆ మాట బిజెపి నాయకులే చెబుతున్నారని వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు.

గద్వాలలో సమస్యలపై ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

గద్వాలలో సమస్యలపై ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల


ఇక తాను ఏం చేస్తున్నా అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానంగా తాను ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నానని వైఎస్ షర్మిల బదులిచ్చారు. డీకే అరుణ ఎప్పుడు ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడలేదని విమర్శలు గుప్పించారు వైయస్ షర్మిల. ఇక్కడ ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్తే సౌకర్యాలు లేవని ఒక మహిళ వైన నువ్వు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయావు అంటూ వైఎస్ షర్మిల డీకే అరుణ ని టార్గెట్ చేశారు. ఇక గద్వాలలో కనీసం ఆసుపత్రి కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందు గద్వాలలో సమస్యలను పరిష్కరించు డీకే అరుణ: షర్మిల సలహా

ముందు గద్వాలలో సమస్యలను పరిష్కరించు డీకే అరుణ: షర్మిల సలహా


తెలంగాణ లో 80 శాతం అక్షరాస్యత ఉంటే గద్వాలలో 40 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందని, ముందు గద్వాల లో ఉన్న సమస్యలను పట్టించుకోవాలని ఆ తర్వాత తనను విమర్శించాలని డీకే అరుణకు వైయస్ షర్మిల సూచించారు . డీకే అరుణ కుటుంబానికి ఎస్సీ, ఎస్టీలు అంటే లెక్క లేదని అందుకే ఈ మధ్య వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా నమోదైందని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చెయ్యండి: వైఎస్ షర్మిల సవాల్

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చెయ్యండి: వైఎస్ షర్మిల సవాల్

ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కూడా విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అమిత్ షా చెప్పడం కాదు.. మీకు దమ్ముంటే, ప్రజాధనం పట్ల చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై, మెగా కృష్ణారెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి అంటూ సవాల్ విసిరారు. మిషన్ భగీరథ కలుషిత నీళ్లు తాగి చనిపోయిన కుటుంబాలకు కేసీఆర్ ఏం న్యాయం చేశారు? అని ప్రశ్నించారు వైయస్ షర్మిల.

గద్వాలలో.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా కేసీఆర్?

గద్వాలలో.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా కేసీఆర్?

రూ.40వేల కోట్ల పథకంలో కమీషన్లు మింగారు కానీ బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి లేదా? కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు లేవా? అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. దొరకు చదువు మీద సోయి లేదు. పిల్లల మీద ధ్యాస లేదు. పాఠాలు చెప్పే టీచర్లు లేక విద్యార్థులు పత్తి ఏరడానికి పోతున్నారని ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా కేసీఆర్? అంటూ వైయస్ షర్మిల గద్వాల లో విద్యార్థుల పరిస్థితిని, పాఠశాలల దుస్థితిని ప్రశ్నించారు.

English summary
DK Aruna was targeted by YS Sharmila in Gadwal. Sharmila who stated that she is not DK Aruna and she is KD Aruna. ys sharmila asked her to tell what was done to Gadwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X