విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషామీరా రీపోస్ట్‌మార్టమ్ పూర్తి... నయా రిపోర్ట్ నిందితులను పట్టిస్తుందా...?

|
Google Oneindia TeluguNews

హత్యకు గురైన ఆయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. సుమారు నాలుగుగంటల పాటు సీబీఐ ఫోరెన్సిక్ అధికారులో ఆధ్వర్యంలో అమె మృతదేహాన్ని వెలికి తీసి రీపోర్టుమార్టమ్ చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు అమె ఎముకల అవశేషాలను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. గాయాలు తగిలిన పుర్రెతో పాటు అస్థికలను కూడ పరీశీలించారు. బాడీ నుండి తీసిన అవశేషాలను ఓ బాక్స్‌లో ఉంచి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

కీలకం కానున్న రీపోస్టుమార్టమ్ రిపోర్టు

కీలకం కానున్న రీపోస్టుమార్టమ్ రిపోర్టు

మృతదేహానికి సంబంధించిన అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీశీలించిన తర్వాత ఆ రిపోర్టును హైకోర్టుకు సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అనుమానితులను ఇప్పటికే పరీశీలించిన సీబీఐ వాటిని నివృత్తిని చేసుకోనుంది. అనంతరం రిపోర్ట్‌లో వచ్చిన అధారాలను బట్టి కేసును మరింత ముందుకు తీసుకుపోయో అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఆపరేషన్‌ సీబీఐ ఎస్పీ విమల్ నేతృత్వంలో జరిగింది. సిబిఐ అధికారులతో పాటు మెజిస్టీరియల్ అధికారాలు గల రాష్ట్ర రెవెన్యూ అధికారులైన తెనాలి సబ్ కలెక్టర్ , స్థానిక తహసీల్దార్ పాల్గోన్నారు.

 2007 ఆయేషామీరా హత్య

2007 ఆయేషామీరా హత్య

కాగా ఆయేషామీరా హత్యకు గురైన పన్నేండెళ్ల తర్వాత రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించిన విషయం తెలిసిందే.. 2007లో ఆమె విజయవాడ సమీపంలోని ఇబ్రంహీంపట్నంలో హత్యకు గురైన తర్వాత అనేక సంచలనాలకు తెరతీసింది. హత్య కేసులో ఎంతో మందిని విచారించి చివరకు వదిలివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడుగా పేర్కోన్న సత్యం బాబుకు మహిళ కోర్టు శిక్ష వేస్తే... సత్యంబాబు నిర్థోషి అంటూ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే దోషులెవరో తేలకపోవడంతో హైకోర్టు నేరుగా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పుడైనా.. అసలు నిందితులు దొరుకుతారా...?

ఇప్పుడైనా.. అసలు నిందితులు దొరుకుతారా...?

ఆయేషామీరా హత్య తర్వాత అనేక అనుమానాలు ,ట్విస్టులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. నిందితులు ఎవరో తెలిపినా...వారి విచారణలో ఎలాంటీ పురోగతి కనిపించలేదు. హత్యానంతరం ఆందోళనలు జరిగినా.. న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ఒంటరిగా న్యాయం కోసం 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే పన్నేడు సంవత్సరాల తర్వాత జరిగిన రీపోస్ట్‌మార్టంలో లభించే ఆధారాలను బట్టి కేసు భవిష్యత్ తేలనుంది. అందుకే మతాచారాలు ఒప్పుకోకున్న అమె మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పుడైనా అసలు దోషులు బయటకు వస్తారా లేదా అనేది వేచి చూడాలి..

English summary
Ayesha meera repostmortem has been completed.who murderd past 12 years in vijyawada of andrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X