ఓరుగల్లులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది, యువతి గొంతుకోసిన లవర్, అనుమానంతోనే..
వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. హన్మకొండలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేయసిపై అనుమానం పెంచుకొని.. చివరికి కడతేర్చాడు. రాంనగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రేయసిని మట్టుబెట్టి.. తాపీగా పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు షాహిద్.

మాట్లాడుదామని చెప్పి
రాంనగర్‌లో షాహిద్ అనే యువకుడు గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. హారతి అనే యువతి, షాహిద్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల హారతిపై షాహిద్‌కు అనుమానం వచ్చింది. ఆమె ఎవరితో చనువుగా ఉంటుందని అనుమానం పెట్టుకున్నాడు. ఈ విషయమై మాట్లాడుదామని హారతిని శుక్రవారం తన గదికి తీసుకొచ్చాడు.

పెనుభూతమైన అనుమానం
రూమ్‌కి వచ్చాక షాహిద్, హారతి కాసేపు బాగానే ఉన్నారు. తన మనసులో ఉన్న అనుమాన భూతాన్ని షాహిద్.. బయటకి తీశాడు. వేరేవాళ్లతో చనువుగా ఉంటున్నారనే అంశంపై డిస్కషన్ కూడా జరిగింది. దీంతో ఆవేశానికి గురైన షాహిద్.. తన గదిలో ఉన్న కత్తితో హారతి గొంతుకోశాడు. ఆమె రక్తపుమడుగులు కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకొచ్చాడు.

పీఎస్‌కు వెళ్లి..
నేరుగా సుబేదారి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తాను యువతిని హతమార్చానని చెప్పడంతో.. పోలీసులు అతని గదికి వచ్చారు. అయితే అతని పక్క గది, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా యువతి హత్య గురించి తెలియదు. పోలీసులు రావడంతో ఏం జరిగిందని ఆరాతీశారు. యువతి హత్య జరిగిందని తెలియడంతో జనాలు గుమిగూడారు. నిందితుడు షాహిద్‌ను విచారించాక పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు.