వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్‌ లో మంత్రి కేటీఆర్ పర్యటనపై ఆసక్తి: అడ్డుకునే వ్యూహంలో బీజేపీ; ఏం జరుగుతుందో?

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్న మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వచ్చే నెలలో రాహుల్ గాంధీ పర్యటన కూడా ఖరారు కాగా వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అంతకు ముందే మంత్రి కేటీఆర్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది .

కేటీఆర్ పర్యటన అడ్డుకోవటానికి రెడీ అవుతున్న బీజేపీ నేతలు

కేటీఆర్ పర్యటన అడ్డుకోవటానికి రెడీ అవుతున్న బీజేపీ నేతలు

మంత్రి కేటీఆర్ బుధవారం నాడు వరంగల్, హనుమకొండ, నర్సంపేట పర్యటనలో భాగంగా రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఓరుగల్లు నగరం అంతా గులాబీ మయంగా మారింది. కేటీఆర్ పర్యటన సక్సెస్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తుంటే, కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు.

గతంలోనూ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ

గతంలోనూ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ

గతంలో ఒకసారి మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన క్రమంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డు పడి బిజెపి కార్యకర్తలు నల్లజెండాలతో తమ నిరసనను తెలియజేశారు. ఇక హన్మకొండలోనూ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఇక తాజాగా నేడు జరుగుతున్న పర్యటనను కూడా అడ్డుకునేందుకు బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధి విషయంలో కేటీఆర్ ను అడ్డుకునే వ్యూహం

వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధి విషయంలో కేటీఆర్ ను అడ్డుకునే వ్యూహం


మంత్రి కేటీఆర్ కు ప్రజల సమక్షంలోనే తమ నిరసన తెలియజేయాలని బిజెపి నేతలు రెడీ అయ్యారు.వరంగల్ ,హనుమకొండ జిల్లాలకు ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఈ రెండు జిల్లాలలో అభివృద్ధి శూన్యంగా పరిస్థితి ఉందని బిజెపి నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సరిగా సద్వినియోగం చేసుకోకుండా వరంగల్ నగరాన్ని అభివృద్ధి శూన్యంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్ పర్యటన నేపధ్యంలో ప్రతిపక్షాల ఫోకస్

కేటీఆర్ పర్యటన నేపధ్యంలో ప్రతిపక్షాల ఫోకస్

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని గులాబీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాషాయ దండు వ్యూహాత్మకంగా తమ నిరసన తెలియజెయ్యాలని చూస్తున్నారు. త్వరలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో అంతకు ముందు జరుగుతున్న కేటీఆర్ పర్యటన పై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దృష్టి సారించారు.

English summary
Minister KTR participating various development works and inaugurations worth Rs 326 crore on Wednesday as part of his visit to Warangal, Hanumakonda and Narsampet. BJP leaders are ready to block the KTR tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X