వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ వీడియో: క్రేన్ సహాయంతో కారు చోరీ; దొంగతనాల్లో కొత్త ట్రెండ్ మొదలైందా!!

|
Google Oneindia TeluguNews

వరంగల్: దొంగతనాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్ లు వంటి ఘటనలు చోటుచేసుకోగా, ఇప్పుడు దొంగతనాలు చేయడంలోనూ సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. రిస్క్ తీసుకోకుండా చోరీలకు పాల్పడుతున్నారు పలువురు చొర శిఖామణులు. తాజాగా వరంగల్ నగరంలో చోటు చేసుకున్న ఒక వింత దొంగతనం ఇక అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక చోరీకి సంబంధించిన వీడియో అందరి మైండ్ లను బ్లాక్ చేస్తుంది. దొంగతనాల్లో కొత్త ట్రెండ్ మొదలైందా అన్న చర్చకు కారణం అవుతుంది.

వరంగల్ నగరంలో షాకింగ్ దొంగతనం జరిగింది. క్రేన్ సహాయంతో అగంతకులు కారు దొంగతనానికి పాల్పడ్డారు . వరంగల్ ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్ లో నివాసముండే జైపాల్ రెడ్డి అనే ఓ వ్యక్తి ఇంటి ముందు నిన్న రాత్రి పార్క్ చేసిన కారును దొంగిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. రాత్రి ఇంటి ముందు కారు పార్క్ చేసి పడుకున్న జైపాల్ రెడ్డి తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి ముందు కారు కన్పించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Shocking video: Car theft with the help of a crane.. new trend in thefts!!

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దొంగ ఎంచక్కా క్రేన్ సహాయంతో కారు దొంగలించి తీసుకు వెళ్ళాడు. దీంతో జరిగిన సంఘటనను గుర్తించి, సిసిటివి ఫుటేజీ ఆధారంగా త్వరితగతిన అనుమానితులను పట్టుకున్నారు పోలీసులు. వీరిని అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. ఇక వీరు చోరీ చేసినటువంటి కారును దొంగలు స్క్రాప్ లో అమ్మినట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ కారు చోరీకి సంబంధించిన వీడియోని చూసిన కొందరు అదేదో ఆడి కార్, బెంజ్ కార్ లాగా క్రేన్ తో ఇంత పెద్ద దొంగతనం చేయడం దేనికీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. దొంగ చోరీ చేసిన కారు చాలా విలువైన కారు కూడా కాదంటూ నవ్వుకుంటున్నారు. ఇండికా విస్టా కారు దొంగతనం చేయడానికి ఇంత పెద్ద స్కెచ్ అవసరమా, క్రేన్ తెచ్చి మరీ చోరీ దేనికి అంటూ దొంగ తెలివి తేటలకు విస్తుపోతున్నారు.

English summary
Thieves stole a car parked in front of a house with the help of a crane in Warangal city. There will be a discussion whether this has started a new trend in thefts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X