నీతో గడపాలంటే ఎంత... ఆ వ్యాపారవేత్త ప్రపోజల్‌కు హీరోయిన్ షాక్
భారతదేశంలో సినీతారలను దేవుళ్ల మాదిరిగా పూజిస్తారు. తమ అభిమాన తారలకు గుళ్లు కట్టి, విగ్రహాలు పెట్టి పూజించిన దేశం మనది. అంతలా వ్యక్తిపూజ తారాస్థాయిలో ఉందని ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. సినీతారలకుండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్ల పుట్టినరోజులు, సినిమా రిలీజ్‌ల సమయంలో అన్నదానాలు, రక్తదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మామూలుగా ఉండవు. వాళ్లను దూరం నుంచి చూస్తేనే చాలు తమ జన్మ ధన్యం అయిపోయింది అన్నట్లుగా భావించే వారు కోట్లలో ఉన్నారు. ఇక ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లకు ఎగబడే వారెందరో.
ప్రతి రాత్రి నరకమే.. వాడుకొని వదిలేశాడు..: బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన
అయితే కొందరు వీరాభిమానులు మాత్రం తమ ఫేవరెట్ స్టార్స్‌తో టైం స్పెండ్ చేయాలని, వాళ్లని పెళ్లి చేసుకోవాలని వింత కోరికలు కోరుతుంటారు. హీరోల సంగతి ఏమో కానీ హీరోయిన్లకు ఈ పరిస్ధితి దారుణంగా తయారైంది. లైవ్ ఛాట్‌లతో అభిమానులతో టచ్‌లో ఉందామని భావించే నటీమణులకు షాకులు తగులుతున్నాయి. వారిని అసభ్యకరంగా ప్రశ్నించడం, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉండటంతో హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అప్పటికప్పుడే స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చేస్తుంటే.. మరికొందరు మౌనంగా ఉండిపోతున్నారు. ఇక మరో కేటగిరి మనుషులు ఉన్నారు... వీరు హీరో హీరోయిన్లను పిచ్చిగా అభిమానించి వారిని పెళ్లి చేసుకోవాలనే ధ్యాసలో ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఓ అభిమాని నుంచి వచ్చిన ప్రపోజల్‌తో ఖంగు తిన్నది. ఈ వివరాల్లోకి వెళితే..

మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సనా ఆల్తఫ్.. 2014లో కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. విక్రమాదిత్యన్, మరియం ముక్కు, రాణి పద్మిని, బషీరింతే ప్రేమలేఖనం, ఓడియన్ సినిమాలతో అలరించారు. మలయాళంతో పాటు తమిళంలో చెన్నై 600028: సెకండ్ ఇన్నింగ్స్, ఆర్కే నగర్, పంచరాక్షరం సినిమాలలో నటించారు. అయితే 2019 తర్వాత సనా నటనకు దూరమయ్యారు. దాదాపు ఐదేళ్లుగా ఆమె తన కుటుంబంతోనే గడుపుతున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హకీం షాజహాన్‌ను పెళ్లి చేసుకున్నారు సనా.
ఆ భయంతోనే సిరీయల్స్ మానేశా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
నటన, అందంతో తిరుగులేదని నిరూపించుకున్న సనాకు వీరాభిమానులు ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఎందరో అభిమానులు మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటూ సనాకు మెసేజ్‌లు పెట్టేవారే. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం వరుసగా మెసేజ్‌లతో విసిగిస్తున్నాడని సనా పేర్కొంది. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా షేర్ చేసింది. వీటి ప్రకారం.. ఆ వ్యక్తి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త బాలాజీ అని తెలుస్తోంది.
డిమోన్ పవన్ పై రీతూ చౌదరి ముద్దుల వర్షం... పబ్లిక్‌గా బాయ్‌ఫ్రెండ్‌తో..
అందులో డియర్ సనా.. ఎలా ఉన్నావు.. నేను చెన్నైకి చెందిన వ్యాపారవేత్త బాలాజీని. నాకు నీతో డేట్‌కి వెళ్లాలని ఉంది. దానికి ఎంత ఛార్జ్ చేస్తావు, అలాగే నీకు ఎప్పుడు కుదురుతుందో కూడా చెప్పు. ఇండియా అయినా ఓకే లేదంటే మాల్దీవులు, దుబాయ్ అయినా పర్లేదు. దీని గురించి మాత్రం బాగా ఆలోచించే అని బాలాజీ మెసేజ్‌లు పెట్టాడు. ఇలా ఒకసారి కాదు.. పలుమార్లు మెయిల్ చేశాడని సనా ఆల్తఫ్ తెలిపారు. అయితే ఈమె ఈ మెసేజ్‌లను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకుండా ఎంత రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడో అంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం బాలాజీ పెట్టిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
Credit: Filmibeat
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications