ఆ మాత్రం తెలియదా? ఎలా సీఎం అయ్యావు.. వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సెటైర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా కళారంగంలోనూ దుమారం రేపుతున్నాయి. ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ మహిళతో అశ్లీల నృత్యాలు చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలపై జబర్దస్త్ కళాకారుడు, లేడీ గెటప్ గా ప్రసిద్ధి చెందిన శాంతి స్వరూప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన శాంతి స్వరూప్, జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ, 'జగన్ గారు... మీరంటే నాకు ఒకప్పుడు అభిమానం ఉండేది. మీరు 'ఆ వీడియో చూపించండి... అమ్మాయిలతో మంత్రి అశ్లీలంగా డ్యాన్స్ చేస్తున్నారు' అని అంటున్నారు. కానీ మంత్రి సుభాష్‌తో స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది నేనే. నేను మహిళను కాదు. లేడీ గెటప్ వేసే కళాకారుడిని. లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తనపై, తన వృత్తిపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన శాంతి స్వరూప్, 'మీకు నేను వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలను లేదా చుట్టూ ఉన్న నేతలను అడిగి ఉంటే నా గురించి చెప్పేవారు. గతంలో మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేశాను. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేను తెలుసు. నిజాలు తెలుసుకోకుండా 'అమ్మాయిలతో అసభ్యంగా చిందులేసే మంత్రి' అంటూ ప్రచారం చేయడం సరికాదు' అంటూ హితవు పలికారు.
Kalki 2: దీపికా స్థానంలో స్టార్ హీరోయిన్? నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ఈ వివాదానికి పూర్తి నేపథ్యాన్ని కూడా శాంతి స్వరూప్ వివరించారు. జనవరి 15న సంక్రాంతి పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో 'సంక్రాంతి సంబరాలు' అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి హైపర్ ఆది టీమ్‌ను ఆహ్వానించారని, అందులో భాగంగానే తాము డ్యాన్స్‌లు, స్కిట్లు ప్రదర్శించామని తెలిపారు. 'డ్యాన్స్ చేస్తుండగా మేమే మంత్రిగారిని స్టేజ్‌పైకి రావాలని కోరాం. కళాకారుల కోరిక మేరకే ఆయన రెండు స్టెప్పులు వేశారు. మంత్రి నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేయలేదు. నేనే ఆయన దగ్గరకు వెళ్లి నృత్యం చేశాను' అంటూ స్పష్టత ఇచ్చారు.
1300 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న టాప్ మూవీస్..
ఇది రికార్డింగ్ డ్యాన్స్ కాదని, వేలమంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన బహిరంగ సాంస్కృతిక కార్యక్రమమని శాంతి స్వరూప్ తెలిపారు. 'ప్రజలను ఎంటర్‌టైన్ చేయడానికి మంత్రి రెండు స్టెప్పులు వేస్తే, దాన్ని అశ్లీలంగా చిత్రీకరించడం చాలా బాధ కలిగించింది' అని అన్నారు. అంతేకాదు, 'మేము ఈవెంట్ల మీదే బతుకుతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మా బతుకుతెరువును దెబ్బతీస్తాయి. ఆ విషయం కూడా ఆలోచించకుండా మాట్లాడడం సరికాదు'అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
2000 కోట్లపై కన్నేసిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ తర్వాత ఆ సూపర్ స్టార్‌తో భారీ ప్లాన్!
మూడు రోజుల పాటు జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయని, కళాకారులను మంత్రి సుభాష్ గౌరవంగా చూసారని శాంతి స్వరూప్ పేర్కొన్నారు. 'ఆ కార్యక్రమం సక్సెస్ కావడాన్ని ఓర్వలేకే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కానీ మంత్రిగారిపై చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా అనిపించాయి'అని అన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యం ఆ మాత్రం తెలియదా? ' అంటూ వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ సెటైర్లు వేశారు.
Chiranjeevi: టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. ఆ బాటలో మెగాస్టార్.. తొలి హీరోగా చిరు రికార్డు ?
'మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేదా కనీసం మీ చుట్టూ ఉన్న కార్యకర్తలను, మీ పార్టీ నేతలను అడిగి నిజాలు తెలుసుకుని మాట్లాడాలి' అంటూ జగన్‌కు శాంతి స్వరూప్ నేరుగా హితవు పలికారు. ప్రజల్లోకి వెళ్లే ప్రతి మాటకు ఒక ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా కళాకారుల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని ఆయన పేర్కొన్నారు.
AA23: అల్లు అర్జున్ కోసం ప్రభాస్ హీరోయిన్.. లోకేష్ మార్క్ మాసివ్ ప్లాన్ ఇదేనా?
అలాగే, జగన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను కూడా శాంతి స్వరూప్ ప్రస్తావించారు. 'లేడీకి, లేడీ గెటప్‌కి తేడా తెలియకుండా మీరు ఎలా సీఎం అయ్యారు?' అంటూ నెట్టింట్లో ఫ్యాన్స్, నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌ను చూసి తనకు చాలా బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రోలింగ్ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, కళారంగాన్ని, కళాకారుల వృత్తిని కూడా అవమానించేలా మారిందని తెలిపారు.
Varanasi: వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్ బాబు మూవీ విడుదల ఆ రోజే!
'ఈ వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధపెట్టినంత మాత్రాన కాదు. ఒక కళాకారుడిగా, ఈవెంట్ల మీదే జీవించే వ్యక్తిగా మా బతుకుతెరువుపై కూడా దెబ్బ పడేలా ఉన్నాయి. ప్రజల్లో తప్పు అభిప్రాయం కలిగితే, రేపు మాకు పని అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విషయం కూడా నాయకులు ఆలోచించాలి'అని శాంతి స్వరూప్ స్పష్టం చేశారు. జగన్‌పై తనకు ద్వేషం లేదని, వ్యక్తిగతంగా ఇంకా గౌరవం ఉందని చెబుతూనే, "నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలాంటి ట్రోలింగ్ జరుగుతోంది. అది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది' అని అన్నారు.
ఆ టెలివిజన్ నటితో అలా బ్రేకప్.. లవ్ అఫైర్ గురించి విజయ్ కార్తీక్ ఎమోషనల్!
ఇదిలా ఉండగా, ఈ వివాదానికి ముందు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశమైన జగన్, సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో 'ఆటవిక రాజ్యం' నడుస్తోందని వ్యాఖ్యానిస్తూ, మంత్రి సుభాష్‌పై 'అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు, స్టేజీపై చిందులు' అంటూ ఆరోపణలు చేశారు.
అప్పటి వరకు రాజమౌళిని పట్టించుకోలేదు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
జగన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంత్రి సుభాష్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. తాను మహిళతో కాదని, లేడీ గెటప్ వేసే కళాకారుడు శాంతి స్వరూప్‌తోనే డ్యాన్స్ చేశానని స్పష్టం చేశారు. "ఈ విషయం జగన్‌కు తెలియదా? కనీసం రోజాను అడిగినా చెప్పేవారు కదా?" అంటూ ఎద్దేవా చేశారు. కళాకారులకు, రికార్డింగ్ డ్యాన్సర్లకు తేడా తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ద్వారా మొత్తం కళారంగాన్నే అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తంగా ఈ పరిణామం చర్చనీయంగా మారింది.
జగన్ కి జబర్దస్త్ నటుడు కౌంటర్..
— మన ప్రకాశం (@mana_Prakasam) January 29, 2026
నటులతో కూడా గడ్డి పెట్టించుకుంటున్న సైకో @ysjagan జగన్ రెడ్డి.. pic.twitter.com/C6FxdDBJY8
Credit: Filmibeat
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications