వాళ్ళు ఏం పీకలేరు.. వాళ్ళను ఫసక్ చేస్తా.. అనసూయ
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన కామెంట్స్ తాలూకా సెగ నేటికీ చల్లారలేదు. అమ్మాయిలు నిండుగా బట్టలు కప్పుకుంటేనే అందంగా ఉంటారని, అలా కాకుండా మోడ్రన్ దుస్తుల్లో శరీరం కనిపించే విధంగా ఉండొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు మహిళలు, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మా అసోసియేషన్, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లడంతో శివాజీ దిగొచ్చారు..
Dhandoraa Closing Collections: దండోరా క్లోజింగ్ కలెక్షన్స్.. శివాజీ మూవీకి లాభమెంత? నష్టమెంత?
మహిళలకు శివాజీ క్షమాపణలు
తాను చెప్పాలనుకున్నది వేరు.. ప్రజల్లోకి వెళ్లినది వేరు. నాలుగు మంచి మాటలు చెప్పే క్రమంలో రెండు తప్పుడు పదాలు దొర్లాయని, వాటిని తాను వాడకుండా ఉండాల్సిందని శివాజీ అన్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అక్కడితో వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే ఆ తెల్లారే అసలు కథ మొదలైంది. తాను ఆ వ్యాఖ్యలు ఎందుకు అనాల్సి వచ్చిందో చెబుతూ ప్రెస్‌మీట్ పెట్టారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చారని సీరియస్ అయ్యారు. దాంతో అనసూయ, చిన్మయి, హీరోయిన్ నిధి అగర్వాల్‌లు ఫైర్ అయ్యారు.

శివాజీ vs అనసూయ
అనసూయ మాత్రం ఎక్కడా తగ్గకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వచ్చారు. దీంతో అది శివాజీ vs అనసూయగా మారింది. సోషల్ మీడియా, సినీ ప్రముఖులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలోకి ట్రావెలర్ అన్వేష్ రావడం.. అతను హిందూ దేవతలు, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మతం రంగు పులుముకుంది. ఎక్కడో మొదలైన వివాదం.. ఎటెటో తిరుగుతోంది.
MSVP: మన శంకర వరప్రసాద్ గారు.. చిరంజీవి, వెంకీ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?
అనసూయపై రాశీ పరోక్ష వ్యాఖ్యలు
రెండ్రోజులుగా వాతావరణం ప్రశాంతంగా ఉంది అనుకునేలోపు సీనియర్ నటి రోహిణి ఎంట్రీ ఇచ్చారు. భారతదేశ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం మహిళలు చీరలు కట్టుకుంటున్నారు. ఫారిన్లో రకరకాల డ్రెస్‌లు వేసుకుంటున్నారు. ప్రతి దేశానికి, సమాజానికి రకరకాల పద్ధతులు ఉంటాయని రోహిణి అన్నారు. ఇదే సమయంలో సీనియర్ హీరోయిన్ రాశీ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. శివాజీ వ్యక్తిగతంగా తనకు తెలుసునని అన్నారు. పాపులర్ తెలుగు కామెడీ షోకి యాంకర్‌గా ఉన్న ఒక ఆవిడ నా గురించి రాశీగారి ఫలాలు అనే పదం వాడారు. ఆ సమయంలో జడ్జిగా ఉన్న ఓ లేడీ కనీసం స్పందించకుండా నవ్వుతూ కూర్చొంది. ఆమె ప్లేస్‌లో నేనుంటే ఇలాంటి పదాలు వాడటంపై నిలదీసేదాన్ని. అసలు బాడీ షేమింగ్ చేయడానికి మీరెవరు అంటూ యాంకర్ అనసూయ పేరెత్తకుండా కామెంట్స్ చేసింది రాశీ.
శివాజీ వివాదంలో ట్విస్ట్.. నేను ఆ ప్లేస్‌లో ఉంటే.. అనసూయపై హీరోయిన్ రాశి ఘాటు వ్యాఖ్యలు
మా మీద పడి బతుకుతారు
గడిచిన రెండు రోజులుగా న్యూఇయర్ వేడుకల నిమిత్తం ఫారిన్లో ఉన్న అనసూయ తాజాగా ఓ వీడియో వదిలారు. అందరికీ హ్యాపీ న్యూఇయర్. నా హెల్త్ నేను చూసుకుంటూ, నా డబ్బులు నేను చేసుకుంటూ, నా ఫుడ్ నేను చేసుకుంటూ కొనుక్కుంటూ ఉన్నా. కొంతమంది ఉంటారు.. పరాన్నజీవులు. ఎదుటివాళ్ల మీద ఆధారపడి తింటారు. వేరేవాళ్లకి డ్యామేజ్ చేస్తూ, వాళ్ల మీద ఆధారపడి తింటారు. వాళ్లని ఏం చేయొచ్చు అనేది నా ఆలోచన ఇప్పుడు. నన్ను నేను స్ట్రాంగ్‌గా చేసుకుంటే వాళ్లేం పీకలేరు. ఈ పరాన్నజీవులంతా ఒక్కసారే ఫసక్ అయిపోయేలా ఏదైనా చేయాలి. అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు. కొన్నిసార్లు నాకు అలా చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఇలా చేయాలనిపిస్తుంది. ఫైనల్‌గా ఎలా చేయాలనిపిస్తుందో అలా చేద్దాం ఏమంటారు. నేను ఎంత క్యూట్‌గా ఉంటాను, ఎంత మంచిదానిని. ఈ పరాన్నజీవులు అలా చేయకపోతే వాళ్లకి బొజ్జ నిండదేమో. ఓకే చూద్దాం.. ఇంకెన్నిరోజులో అంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రంగమ్మత్త వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అనసూయ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Credit: Filmibeat
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications