సినీ
నటి
రంజితతో
రాసలీలలు
నడిపినట్లు
ఆరోపణలు
ఎదుర్కుంటున్న
నిత్యానంద
మరో
వివాదంలో
చిక్కుకున్నారు.
నిత్యానంద
సంస్థపై
అమెరికా
ఫెడరల్
లా
కింద
చర్యలు
తీసుకోవాలని
కోరుతూ
ప్రవాస
భారతీయుల
(ఎన్నారైల)
గ్రూపు
ఒక్కటి
ఫిర్యాదు
చేసింది.
అమెరికాలోని
మాఫియాను
ప్రాసిక్యూట్
చేయడానికి
ఫెడరల్
లాను
వాడుతారు.
ఓక్లహోమాలో
ఉన్న
నిత్యానంద
ఫౌండేషన్‌పై
కాలిఫోర్నియాలోని
సాన్
బెర్నార్డో
సుపీరియర్
కోర్టులు
30
మంది
ఎన్నారైలు
దావా
వేశారు.
ఫౌండేషన్
ఇద్దరు
డైరెక్టర్లు
మా
నిత్య
సదానంద
అలియాస్
డి
జమునా
రాణి,
శివ
వల్లభనేని
అలియాస్
నిత్య
సచ్చిదానందలపై
వారు
మార్చి
4వ
తేదీన
ఫిర్యాదు
చేశారు.
బెంగళూర్‌లోని
బిదాడీ
ఆశ్రమం
నుంచి
పరారీ
కావడంతో
నిత్యానంద
కార్యదర్శి
సదానంద
అలియాస్
ధనశేఖరన్
భార్య
జమునా
రాణికి
సమన్లు
అందలేదు.
ఫ్రాడ్,
కుట్ర,
ఒప్పంద
ఉల్లంఘన,
అక్రమ
వ్యాపారాల
కింద
ఎన్నారైలు
నిత్యానంద
ఫౌండేషన్
డైరెక్టర్లపై
ఆరోపణలు
చేశారు.
పదేళ్ల
కాలంలో
27
ఫెడరల్
నేరాలు,
ఎనిమిది
స్టేట్
నేరాలు
చేసినవారిపై
ప్రయోగించే
రాకటీర్
ఇన్‌ఫ్లుయెన్స్‌డ్
అండ్
కరప్ట్
ఆర్గనైజేషన్స్
(రికో)
కింద
చేసే
ఆరోపణలు
వారిపై
చేశారు.
ఈ
నేరాలు
రుజువైతే
దోషులకు
25
వేల
డాలర్ల
జరిమానా,
20
ఏళ్ల
జైలు
శిక్ష
పడుతుంది.
A group of NRIs has moved legally to invoke a united states Federal law, whose intended is it to prosecute the American mafia, against non - profit organisation of Nithyananda.
Story first published: Friday, March 11, 2011, 9:40 [IST]