వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో దసరా వేడుకలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, ఒర్టెగ పార్క్, సన్నీవేల్, కాలిఫోర్నియాలలో ప్రకృతి పండగ బతుకమ్మ సంబరాలతో దుర్గామాత దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రవాస తెలంగాణ వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. అశ్వయుజ శుక్ల తృతీయ అయిన అక్టోబర్ 6నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో మహిళలకు సంబంధించి పెద్ద పండగ.. బతుకమ్మ పండగ.

బతుకమ్మ అంటే బతుకునిచ్చే దేవతగా పేర్కొంటారు. బతుకమ్మ పండగ జరుపుకోవడానికి మూలం ఎన్నో పురాణా గాథలు. అందులో ఒకటి.. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ రాజు ధర్మాంగదకు ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత పుట్టిన బిడ్డ లక్ష్మీదేవి. చిన్నతనంలోనే అనేక ప్రమాదాలకు గురవడంతో ఆమెకు బతుకమ్మగా పేరు పెట్టడం జరిగింది. బతుకమ్మ అంటే జీవితాన్నిచ్చే అమ్మ అని అర్థం. బతుకమ్మ(పార్వతీ దేవి)కి పూలంటే ఇష్టం కాబట్టి పూలతో ఆలంకరించిన బతుకమ్మలను మహిళలు తయారు చేసి పూజిస్తారు.

Bathukamma

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో 9వ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలను ప్రవాస తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం ఛైర్మన్ సాయిదీశ్ అజ్జన్, అధ్యక్షుడు భాస్కర్ మడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రకళ శ్రీరామదాసు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాన్ని స్థానిక పురోహితుడు సుబ్రమణ్య శాస్త్రి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఉత్సవాలకు సాంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు, మహిళలు భారీగా తరలివచ్చారు. గునుక, కట్ల పూలతోపాటు స్థానికంగా లభించిన వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా తయారు చేశారు. బతుకమ్మల మధ్యలో గౌరీ మాతా చిత్రాన్ని ఉంచి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ.. లయబద్దంగా నృత్యాలు చేశారు.

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆఫీస్ బేరర్లు భులేశ్వర్ ఇందారపు, రాజు యాసలలు మార్కెట్లలో తిరిగి వివిధ రకాల పూలను సేకరించినట్లు టిసిఏ సభ్యులు తెలిపారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే ఉత్సవాలను నిర్వహించిన సంఘ సభ్యులను హాజరైన పలువురు ప్రముఖులు అభినందించారు. టిసిఏ సభ్యులు, వాలంటీర్లు విజయ్ చవ్వ, మహిపాల్ అన్నం, భాస్కర్ బందికల్లు, శ్రీనివాస్ గుజ్జ, ప్రసాద్ గట్టు కార్యక్రమానికి హాజరైన వారందరికి భోజన ఏర్పాట్లు చూసుకున్నారు.

ఉత్సవంలో అందమైన బతుకమ్మలకు బహుమతులు కూడా అందించారు. అన్నీ బతుకమ్మలు అందంగా ఉండడంతో అందులో అందమైన బతుకమ్మను ఎంపిక చేయడం నిర్వాహకులకు కష్టంగానే మారిందని సభ్యులు తెలిపారు. టాప్ 10 బతుకమ్మలకు న్యాయమూర్తులు అవార్డులను ప్రకటించారు. నీలిమా సింగిరెడ్డి తయారు చేసిన బతుకమ్మకు మొదటి బహుమతి లభించింది.

ఉత్సవంలో పాల్గొన్న వారందిరికీ కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహకులు మహిపాల్ అన్నం.. సాన్ రమోన్‌లో శనివారం(అక్టోబర్ 12) జరిగే బతుకమ్మ ఉత్సవాలకు కూడా హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి హాజరుకాకపోయినా మాజీ టిసిఏ సభ్యులు బిక్షం పాలబిందెల, బుచ్చన్న గాజులలు అభినందనలు తెలియజేసినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి టిసిఏ ఛైర్మన్ సాయిదీశ్ అజ్జన్ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
The Durga Navarathri festival for the year 2013 got launched off to a colorful start in the heart of Silicon Valley at Ortega Park, Sunnyvale, California with the celebration of Bathukamma festival, also known as the festival of flowers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X