టెక్కీ మృతదేహాన్ని తెప్పించండి: సుష్మాకు కెటిఆర్ విజ్ఞప్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టెక్కీ కోన ఆదినారాయణ రెడ్డి మృతదేహాన్ని భారత్‌కు తెప్పించాలని తెలంగాణ ఎన్నారై వ్యవహారాల మంత్రి కెటి రామారావు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.

సాయంత్రమే మాట్లాడాడు.. రాత్రికల్లా..., ఆదిలోనే చితికిన ఆదినారాయణరెడ్డి ఆశలు..

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌లో పనిచేయడానికి హైదరాబాద్ వచ్చిన కోన ఆదినారాయణ రెడ్డి ఆర నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు.

KTR to Sushma: Bring back body from Australia

మృతదేహాన్ని తెప్పించడానికి సహాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిడ్నీలోని భారత కాన్సుల్ జనరల్‌కు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఓవర్సీస్ ఇండియన్స్‌కు లేఖలు రాసింది.

టెక్కీ ఆది మృతి ఇంకా మిస్టరీనే: అతనొస్తే తెలిసే చాన్స్

ఇటీవల ఆదినారాయణ రెడ్డి సిడ్నీలోని తన గదిలో మరణించాడు. అతని మరణానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణం తెలియలేదు. అతను మరణించిన రెండు రోజుల తర్వాత తమకు తెలిసిందని ఆయన బంధువులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister K T Rama Ra urged Union external affairs minister Sushma Swaraj for help in getting the body of Kona Adinarayana Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి