వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా మరణం గురించి రాస్తా: శివసాగర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విప్లవ భావుకుడిగా అతను జీవితం ఎత్తుపల్లాలను చూశాడు; నెత్తుటిధారలను, కన్నీటినీ చూశాడు. మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా విప్లవ సాధనకు కోసం ఎన్నో ప్రయోగాలు చేశాడు; మిగిలింది నిరాశానిస్పృహలే.

శివసాగర్‌గా జనం గుండెల్లో స్థిరపడిన కె.జి. సత్యమూర్తి అక్కడ ఇమడలేక బయటకు వచ్చాడు. అయితే తన లక్ష్యసాధనకు అవసరమైన దృష్టిని కోల్పోలేదు. జీవితం ఆయనకు ప్రేరణ, మానవ విముక్తి ఆయనను ముందుకు నడిపిస్తుంది.

శివసాగర్‌ ఇప్పుడు తన ఆత్మకథను 'నా కథ' పేర రాయడంలో నిమగ్రమయి వున్నాడు. ఇది వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని ఆయన అంటున్నారు. దాంతో పాటు ఆయన దళిత బహుజన విప్లవ కమ్యూనిస్టు పార్టీ పేర కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

తన ఆత్మకథలో తన బాల్యదశను చిత్రించడం పూర్తయిందని ఆయన ఇటీవల సంభాషణ మధ్యలో చెప్పాడు. ''నేను నా మరణం గురించి కూడా రాయాలనుకుంటున్నాను. నేను మరణాన్ని గొప్ప జుబిలియేషన్‌తో, రింగింగ్‌ బెల్స్‌తో, బీటింగ్‌ డ్రమ్స్‌తో ఆహ్వానిస్తాను'' అని కవి శివసాగర్‌ చెప్పాడు. రెవెల్యూషనరీ రోమాంటిక్‌ లేబిల్‌తో సంతృప్తి చెందుతున్నారా అని అడిగితే ''ప్రాథమికంగా అదే లక్షణం నాలో కొనసాగుతోంది. నా కవిత్వం ప్రధానంగా నాకు సంబంధించిన రెవెల్యూషరీ సైకాలజీ యొక్క కళాత్మక పరిశోధన'' అని ఆయన జవాబిచ్చాడు.

రెవెల్యూషనరీ పర్‌సెప్షన్‌లో మార్పేమైనా వచ్చిందా అని అడిగితే- ''నా కవిత్వం విప్లవ ప్రస్థానం. అది దానంతటదే విప్లవంతో పెనవేసుకుపోయింది. నా అభిప్రాయంలో నిజమైన విప్లవం జీవితంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల అన్ని పార్శ్వాల తలుపులు తడుతుంది. విప్లవం గానీ, విప్లవ కవిత్వం గానీ రాజకీయ రంగం ఒక్కదానికే పరిమితం కాదు'' అని శివసాగర్‌ అన్నాడు.

పీపుల్స్‌వార్‌ నుంచి బిఎస్‌పి వరకు- ఇటీవలి బహుజన రిపబ్లికన్‌ పార్టీ వరకు- మిగిలిందంతా ఆయనకు నిరాశేనా? ఇదే విషయం అడిగితే- ''నాకు అప్పాయింట్‌మెంట్స్‌ మాత్రమే వున్నాయి; డిసప్పాయింట్‌మెంట్స్‌ లేవు'' అని నవ్వాడు. ''విప్లవం ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉంది. సాయుధ పోరాటంగా మలుపు తిప్పేందుకు రాజకీయ ఘర్షణ అవసరం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కవిగా ఆయన స్థానమేమిటి? ''విప్లవ దళితుడిగా నేను విప్లవ కవిత్వం రాశాను. దళిత విప్లవకారుడిగా దళిత కవిత్వం రాశాను. ఇప్పుడు దళిత, స్త్రీవాద, విప్లవ కవిత్వాన్ని సింథసైజ్‌ చేయాలనుకుంటున్నాను. నాకు సంబంధించినంత వరకు కవిత్వం మెంటల్‌, ఇమోషనల్‌ ఫొటోగ్రఫీ'' అని శివసాగర్‌ చెప్పారు.

''మీకు ఇష్టమైన కవులు ఎవరు?'' అని అడిగితే ''ఆధునిక కవుల్లో కృష్ణశాస్త్రి, ప్రగతిశీల కవుల్లో శ్రీశ్రీ, విప్లవ కవుల్లో చెరబండరాజు, గద్దర్‌, దళిత కవుల్లో మద్దూరి నాగేష్‌బాబు, పైడి తైరేష్‌బాబు నాకు ఇష్టం'' అని చెప్పాడు. కవిగా మీకున్న ఫాంటసీలేమిటని ప్రశ్నించినప్పుడు ''జీవితం, విప్లవ ఎగుడుదిగుడులు. విప్లవం నిరాశాజనకంగా వున్నప్పుడు నేను కవిత్వం రాశాను. శ్రీకాకుళ పోరాటం విఫలమైన తర్వాత నేను ఉద్యమం నెలబాలుడు రాశాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X