వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా తెలుగు తల్లి పాటపై ఎందుకీ వ్యతిరేకత?

By కె.నిశాంత్
|
Google Oneindia TeluguNews

Telugu Talli
అన్ని పాఠశాలల్లో శంకరంబాడి సుందరాచార్య రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట పాడాలనే పాఠశాల విద్యా మంత్రి మాణిక్య వరప్రసాద్ జారీ చేసిన ఆదేశాలపై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో ఈ వ్యతిరేకత ఎదురు కావడం సహజమే. నిజానికి, శంకరంబాడి సుందరాచార్య పాటలో ఎనలేని మాధుర్యం ఉంది. సుందరాచార్య రాసిన పాట ఒకానొక చారిత్రక సందర్భంలో తన కర్తవ్యాన్ని నిర్వహించింది. బ్రిటిషాంధ్ర స్వాతంత్ర్యోద్యమానికి, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి అదొక స్ఫూర్తినిచ్చింది. ఆ రకంగా అది చాలా గొప్ప కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా అది మరుపునకు వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ అవిర్భావం తర్వాత దాన్ని ఒక జాతీయ గీతం స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభలన్నింటిలోనూ, ప్రభుత్వ సభల్లోనూ ఈ గేయాలపన ఒక రకంగా తప్పనిసరిగా మారింది.

కానీ, ప్రస్తుత సందర్భం వేరు. నీటి కొసం తెలంగాణ రాష్ట్రం తల్లడిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సాగునీటి సమస్య, సాగునీటి ప్రాజెక్టుల సమస్య అత్యంత ప్రధానమైంది. బిరబిరా కృష్ణమ్మ, గలగలా గోదారి పారుతుంటే బంగారు పంటలే పండుతాయని ఆ పాటలో చరణాలున్నాయి. కృష్ణాగోదావరి నదులు తెలంగాణ నుంచి పారుతున్నా వాటి ఫలితం ఈ ప్రాంతానికి దక్కడం లేదు. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా గోదావరి నదులపై కట్టిన ఆనకట్టల వల్ల ఆ నదుల నీరు వినియోగంలోకి వచ్చి కోస్తాంధ్ర సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయం లాభదాయకమైన వృత్తిగా కూడా మారింది. అది తెలంగాణకు లేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు తెలంగాణను కలుపుకోవడానికి ఇచ్చిన హామీల్లో ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు కూడా హామీ ఉంది. కానీ వాటిని తదనంతర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనివల్ల ప్రస్తుతం పూజలందుకుంటున్న తెలుగు తల్లి తమకు సవతి తల్లి మాత్రమేననే భావన తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉంది. అందుకే తెలంగా ప్రజలు తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నారు.

మరో ముఖ్యమైన విషయం, పాటలో తెలంగాణ ప్రతీకలేమీ లేవు. స్వాతంత్య్యోద్యమ కాలంలో, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ అనే ప్రాంతం తమకు చెందిందనే భావన కోస్తా ప్రాంతంలో ఉన్నట్లులేదు. నిజాం రాజ్యంగా దీనికి గుర్తింపు. ఇక్కడివారికి తెలుగు రాదనే దురభిప్రాయం కూడా ఉండేది. అందువల్ల శంకరంబాడి సుందరాచార్య తన గేయంలో తెలంగాణ తెలుగు ప్రజలను ఉద్దేశించి ఈ పాటను రాశారని చెప్పడానికి లేదు.

ఇంకా చెప్పాలంటే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటలో ప్రతీకలేవీ తెలంగాణకు సంబంధించినవి లేవు. త్యాగయ్య, తిక్కయ్య, తిమ్మరసు, కృష్ణ దేవరాయల వంటి చారిత్ర పురుషుల, కవుల పేర్లు ఈ గేయంలో వస్తాయి. అవి స్ఫూర్తినందించడానికి వాడిన పేర్లుగా మనం భావించవచ్చు. నిజానికి, అది స్ఫూర్తి గేయమే. తెలంగాణకు సంబంధించిన చారిత్రక పురుషులు, కవుల ప్రస్తావన ఆ పాటలో లేవు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ పాట నుంచి స్పూర్తి పొందేదేమీ లేదు. అయితే సాంస్కతిక పరాయికరణలో వాటిని తెలంగాణ ప్రజలు కూడా స్వకరించే స్థాయికి చేరింది. ప్రస్తుత తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో తెలంగాణ తన మూలాలను, తన వాసత్వాన్ని, తన చరిత్రను అన్వేషిస్తున్నది. అందువల్ల తనను తాను వెతుక్కుంటోంది. అందుకు గాను అరువు తెచ్చుకున్న సాంస్కతిక ప్రతీకలను తోసిపుచ్చుతున్నది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను వ్యతిరేకిస్తున్నారు.

English summary
K Nishanth on Maa Telugu Talli song
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X