డోంట్ మిస్: ఆకాశంలో అద్భుతం ఆవిష్కారం
Planetary Parade: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. అష్టగ్రహాల కూటమి కనువిందు చేయబోతోంది. మొత్తం ఆరు గ్రహాలు సమాంతర రేఖపై కనిపించనున్నాయి. ప్లానెటరీ పరేడ్ సందడి చేయనుంది. ఇలాంటి అవకాశం రావడం అత్యంత అరుదు. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత అంటే 2034లోనే ఇలాంటి అష్ట గ్రహాల కూటమి ఏర్పడుతుంది. దీన్ని తిలకించడానికి స్కైగేజర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.
ఈ నెల 28వ తేదీన ఆరంభం..
కొన్ని రోజులుగా మూడు గ్రహాలు ఆంబరాన సందడి చేస్తూ వస్తోన్నాయి. శుక్రుడు (వీనస్), బుధుడు (మెర్క్యురి), గురు/ బృహస్పతి (జుపిటర్), ఇప్పటికే తరచూ పలకరిస్తోన్నాయి. తాజాగా వీటికి శని, యురేనస్, నెప్ట్యూన్ కూడా వీటితో జతకట్టనున్నాయి. ఈ మూడూ ఒకే వరసలోకి రావడం ఇదే తొలిసారి అవుతుంది. అష్ట గ్రహాలు కూటమి కట్టడం ఈ నెల 28వ తేదీన ఆరంభమౌతుంది. మార్చి 7-8వ తేదీ వరకు ఆకాశంలో పశ్చిమ దిక్కున కనువిందు చేస్తుంది.

సూర్యుని ప్రదక్షిణ మార్గంలో..
సూర్యుని ప్రదక్షిణ మార్గంలో గ్రహాలు ఒకే సరళ రేఖలో ఉన్నట్లు కనిపించినప్పుడు భూమి నుండి ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుంది. బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్- ఈ ఆరు గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలో నిలవనున్నాయి. ఆరు నెలల తర్వాత తొలి ఆరు గ్రహాల పరేడ్ ఇదే కానుంది. ఆరు గ్రహాలలో నాలుగు మాత్రమే సాధారణ కంటితో చూడవచ్చు. బుధుడు, శుక్రుడు, శని, గురు గ్రహాలను సాధారణ కంటితో వీక్షించవచ్చు.
టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్..
సుదూరంగా ఉండటం వల్ల యురేనస్, నెప్ట్యూన్లను టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ద్వారా చూడాల్సి ఉంటుంది. బుధ గ్రహాన్ని గుర్తించడం కొన్నిసార్లు కష్టతరమవుతుంది. ఫిబ్రవరి 28 సాయంత్రం సూర్యాస్తమయం అయిన 30 నుండి 60 నిమిషాల తర్వాత, పశ్చిమ దిశలో నేల అంచుకు దగ్గరగా చూడటం మంచిది. స్పష్టమైన వాతావరణం, అవాంతరాలు లేని వీక్షణ ఉత్తమం. శుక్రుడు అత్యంత తేజస్సుతో కనిపిస్తాడు. శని, బుధుడు తక్కువ ఎత్తులో, బృహస్పతి కాస్త ఎత్తులో కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ఔత్సాహికులు వైడ్-యాంగిల్ లెన్స్, ట్రిపాడ్ను ఉపయోగించవచ్చు.
ఈ ఏడాది ఇతర ఖగోళ విశేషాలు..
ఈ ఏడాది ఇతర ఖగోళ విశేషాలు కూడా అనేకం ఉన్నాయి. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే, ఒకే నెలలో రెండో పౌర్ణమిగా 'బ్లూ మూన్' మే 31న ఆకాశంలో దర్శనమిస్తుంది. జూన్ 8-9 తేదీలలో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన శుక్రుడు, బృహస్పతి గ్రహాలు చాలా దగ్గరగా వచ్చి, కంటితో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సంవత్సరం ద్వితీయార్థంలో రెండు ఉల్కాపాతాలు ఆసక్తిని కలిగించనున్నాయి. ఆగస్టు 12-13న పెర్సిడ్స్, డిసెంబర్ 13-14న జెమినిడ్స్ ఉల్కాపాతం ఉంటాయి. దీంతో పాటు, క్రిస్మస్ ఈవ్ నాడు 'సూపర్‌మూన్' ఏర్పడుతుంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications