Year Ender 2025: ఈ ఏడాది ఆదాయంలో టాప్ 10 క్రికెటర్లు వీరే..!
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లను ఆకాశానికెత్తేస్తే, మరికొందరిని నేలపై పారేసింది. అయితే ఇలా ఆకాశానికెగిరిన క్రికెటర్లు, వారి సంపాదన మాత్రం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వివిధ దేశాల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్ లు, కాంట్రాక్టుల ద్వారా ఆయా క్రికెటర్లు భారీగా సంపాదించారు. ఇందులో టాప్ 10 క్రికెటర్లను చూసుకుంటే భారతీయులే ముందున్నారు. అయితే విదేశీ క్రికెటర్లు కూడా పలుమార్గాల్లో తమ సంపాదన పెంచుకున్నారు.
అంతర్జాతీయంగా ఈ ఏడాది టాప్ 10 ఆదాయార్జన క్రికెటర్లలో మన కింగ్ విరాట్ కొహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరి తర్వాత తిరిగి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్, న్యూజీలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఉన్నారు.

ఈ ఏడాది టాప్ లో నిలిచిన విరాట్ కొహ్లీ భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు ఆడటం ద్వారా ఏకంగా 300 కోట్ల ఆదాయం సంపాదించాడు. ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా జట్టుతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం ద్వారా 244 కోట్లు సంపాదించాడు. మిచెల్ స్టార్క్ కూడా ఆసీస్ తో పాటు టీ20 లీగ్ ల ద్వారా 238 కోట్లు అర్జించాడు. స్టీవ్ స్మిత్ 226 కోట్లు, డేవిడ్ వార్నర్ 215 కోట్లు, రోహిత్ శర్మ 213 కోట్లు, జోస్ బట్లర్ 209 కోట్లు, ట్రెంట్ బౌల్డ్ 206 కోట్లు, జస్ ప్రీత్ బుమ్రా 204 కోట్లు, కేన్ విలియమ్సన్ 201 కోట్లు సంపాదించారు.

ఆయా క్రికెటర్లు తమ జాతీయ జట్లకు ఆటడంతో పాటు ఐపీఎల్ సహా వివిధ టీ20 లీగ్ లలో పాల్గొన్నారు. అలాగే ఆయా లీగ్ లలో మ్యాచ్ ఫీజు, బ్రాండింగ్ ద్వారా, కాంట్రాక్టుల ద్వారా భారీ ఆదాయం సంపాదించారు. కొత్త ఏడాదిలో భారత క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ వంటి వారు అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు దూరం కావడంతో వారు ఐపీఎల్ ద్వారానే సంపాదించబోతున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications