Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీం ఇండియాను వణికించిన 22ఏళ్ల కుర్రాడు- ఎవరీ జాకబ్ బెథెల్, IPL టీం..రేటు..!!

జాకబ్ బెథెల్. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం అభినందిస్తున్న పేరు. భారత్ తో జరిగిన సెమీ ఫైనల్ లో చివరి వరకు సూర్య టీంను బెంబేలెత్తించాడు. 22 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ను భారత్ ఫ్యాన్స్ తో సహా క్రికెట ను ఇష్టపడే ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్ ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు అంతగా ప్రచారంలో లోని జాకబ్ బెథెల్ ఐపీఎల్ లోనూ తన ఆటతో ఆకట్టుకున్నాడు. అయితే, ఏ టీం నుంచో తెలుసా.. ఎంతకు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది అనేది ఆసక్తి కరమే. ఇప్పుడు సోషల్ మీడియాలో బెథెల్ గురించి పెద్ద ఎత్తున సెర్చింగ్ జరుగుతోంది.

జాకబ్ బెథెల్ టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ ను గెలుపు చివరి వరకు తీసుకెళ్లిన యువ కెరటం. 22 ఏళ్ల ఈ యవ సంచలనం ఆట తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ఉన్నా భయపడలేదు. దూకుడు ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ ను గెలిపించినంత పని చేశాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ తో ఒక్కసారిగా జాకబ్ బెథెల్ హీరో అయిపోయాడు.

Jacob Bethell 22 year old English All Rounder global reputation skyrocketed during the T20 World Cup semi-final

జాకబ్ గ్రాహం బెథెల్ ఇంగ్లండ్ క్రికెటర్. సెప్టెంబర్ 2024లో సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దేశీయ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 2003 అక్టోబర్ 23న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో పుట్టి పెరిగిన బెథెల్.. వార్విక్‌షైర్‌లోని ప్రతిష్టాత్మక రగ్బీ స్కూల్‌లో స్కాలర్‌షిప్ పొందాడు. 13 సంవత్సరాల వయసులో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అతని తాత ఆర్థర్ బెథెల్ బార్బడోస్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

Jacob Bethell 22 year old English All Rounder global reputation skyrocketed during the T20 World Cup semi-final

ఆర్టీసీ నుంచి ఐపీల్ లోనూ సత్తా చాటుతూ

2024లో న్యూజిలాండ్ పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేయడానికి ముందు.. బెథెల్ ఇంగ్లండ్ తరపున 20 టీ20 మ్యాచ్‌లు, 18 వన్డే మ్యాచ్‌లు, 4 టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో సగటున 38.7 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 96. ఆగస్టులో ఓవల్‌లో భారత్‌ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో అతడు 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం 6, 5 పరుగులు మాత్రమే చేశాడు. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన మ్యాచ్‌లో బెథెల్ తన ఆటతో ఆకట్టుకున్నాడు.

Jacob Bethell 22 year old English All Rounder global reputation skyrocketed during the T20 World Cup semi-final

ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టు సభ్యులు జై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్, టాడ్ మర్ఫీలను ఎదుర్కొని ఇంగ్లండ్ లయన్స్ తరపున 71 పరుగులు చేశాడు. బెథెల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్దోడాక్స్ బౌలర్ కూడా. టెస్ట్ బెస్ట్ ఫిగర్స్ 3-72. ఇక, ఐపీఎల్ మెగావేలం 2026కి ముందు ఆర్‌సీబీ జాక‌బ్ బెథెల్‌ను 2.60 కోట్ల‌కు నిలుపుకుంది. వాంఖ‌డేలో జాకెబ్ విధ్వంసం చూశాక.. ఆర్‌సీబీ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్‌లో అత‌డు ఇంకెన్ని విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడ‌తాడో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+