Virat Kohli: కొహ్లీ రికార్డుపై భారీ తప్పిదం ? ఫ్యాన్స్ దెబ్బకు ఐసీసీ..!
గతేడాది పరుగుల సాధనలో పడుతూ లేస్తూ టీమిండియాలో తన స్ధానాన్నే ప్రశ్నార్ధకంగా మార్చుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ.. ఏడాది చివరి నాటికి ఉగ్రరూపం దాల్చాడు. అసాధారణ ఇన్నింగ్స్, వరుస సెంచరీలతో దుమ్మురేపాడు. ఫ్యాన్స్ తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఆడుతూ వారికి కనువిందు చేశాడు. తద్వారా ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత ఈ రికార్డు అందుకున్న కొహ్లీకి ఐసీసీ అంతలోనే షాకిచ్చింది.
గతంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో సుదీర్ఘకాలం టాప్ లో ఉన్న కింగ్ విరాట్ కొహ్లీ .. ఆ స్ధానం కోల్పోయాక తిరిగి దానికి చేరుకునేందుకు ఎంత సమయం తీసుకున్నాడన్న విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. ఈ క్రమంలోనే గణాంకాలను పొరబాటున తప్పుగా ప్రచురించింది. కొహ్లీ తన కెరీర్లో నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా ఎన్ని రోజులు గడిపాడో వివరిస్తూ సోషల్ మీడియా గ్రాఫిక్‌ను తప్పుగా పోస్ట్ చేసింది. కోహ్లీ తన కెరీర్లో నంబర్ 1 పురుషుల వన్డే బ్యాటర్‌గా 825 రోజులు ఉన్నాడని, టాప్ ర్యాంక్ పొందిన వన్డే బ్యాటర్‌గా గడిపిన అత్యధిక రోజుల జాబితాలో అతను 10వ స్థానంలో ఉన్నాడని ఐసీసీ పేర్కొంది.

అయితే ఇది తప్పు. ఎందుకంటే ఐసీసీ గతంలో ప్రకటించిన అన్ని గణాంకాల్లోనూ కోహ్లీ 1,547 రోజులు అగ్రస్థానంలో గడిపాడని పేర్కొన్నాయి.కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా కేవలం 825 రోజులు మాత్రమే ఉన్నట్లు చూపడంపై ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తమ అభిమాన క్రికెటర్ విషయంలో ఐసీసీ వ్యవహరించిన తీరుతో ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టేశారు. దీంతో విషయం గ్రహించిన ఐసీసీ దాన్ని తాజాగా సవరించింది. సదరు పోస్టును తొలగించింది. కోహ్లీ నిజానికి 1,547 రోజులు నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా గడిపాడని తాజాగా స్పష్టం చేసింది.

దీంతో కోహ్లీ 10వ స్థానం నుండి ఈ జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజాలు సర్ వివియన్ రిచర్డ్స్ (2,306 రోజులు), బ్రియాన్ లారా (2,079 రోజులు) తర్వాత కొహ్లీ మూడో స్ధానంలో నిలిచాడు. ఇప్పుడు ఒకే ఒక ఫార్మాట్లో యాక్టివ్‌గా ఉన్న కోహ్లీ.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ మ్యాచ్ వరకు వన్డే , దేశీయ లిస్ట్ ఎ క్రికెట్లో ఏడుసార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications