Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World cup: పాకిస్థాన్ కు USA హెచ్చరిక, హిస్టరీ రిపీట్ ఖాయం..!!

USA vs Pakistan: T20 World cupలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. చిన్న జట్లు గా చెప్పుకునే టీంలు ఊహించని ఆట తీరుతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నాయి. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అమెరికా బౌలర్లు వరుస వికెట్లు తీసి పైచేయి సాధించారు. సూర్య కుమార్ నిలబడటంతో భారత్ కు మంచి స్కోరు దక్కింది. ఇక.. ఈ రోజు పాకిస్థాన్ తో అమెరికా తల పడే వేళ యూఎస్ టీం నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. భారత్ తో ఆదివారం పాక్ తలపడ నుంది. దీనికి ముందు అమెరికాతో పాక్ మ్యాచ్ ఆసక్తి కరంగా మారింది.

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు (మంగళవారం) ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌-ఏ నుంచి పాకిస్థాన్‌- అమెరికా జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా జట్టు పాక్ తో మైండ్ గేమ్ మొదలు పెట్టింది. పాకిస్థాన్ ను ఓడిస్తామంటూ అమెరికా ఆల్ రౌండర్ మొహమ్మద్‌ మొహ్సిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచ కప్ లో తాము పాక్‌ను ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు.
భారత్ తో జరిగిన గత మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పారు.

T20 World cup USA all-rounder Mohammad Mohsin warns pakistan captain Salman Agha s men ahead clash

అదే విధంగా గత మ్యాచ్ లో మేము చేసిన చిన్న చిన్న లోపాలను సరి చేసుకుంటామని వివరించారు. ఇక పాకిస్థాన్‌ను ఇప్పటికే ఒకసారి తాము ఓడించామని.. దీంతో, వారి మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని విశ్లేషించారు. ఈ టోర్నీలో తాము పెద్దగా కోల్పోయేది ఏమి ఉండదని తేల్చేసారు. ప్రస్తుతం ఈ ఐసీసీలో తమ జర్నీని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు మొహమ్మద్‌ మొహ్సిన్‌ వెల్లడించారు.

భారత్ తో జరిగిన మ్యాచ్ లో గట్టిపోటీ ఇచ్చి.. టోర్నీని మెరుగ్గా ఆరంభించినట్లు చెప్పుకొచ్చారు. ఇక పాకిస్థాన్‌పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నామని ధీమా వ్యక్తం చేసారు. తమ జట్టు గతం కంటే ఇప్పుడు చాలా బలంగా ఉందని చెప్పారు. అందుకే పాక్‌ను ఓడిస్తామనే నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. గత మ్యాచ్‌ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతామని అని మొహ్సిన్‌ వెల్లడించారు. కాగా.. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ లీగ్‌ దశలో పాక్‌పై యూఎస్ఏ సంచలన విజయం సాధించింది.

నాడు డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 7 వికెట్ల నష్టానికి159 పరుగులు చేసింది. అమెరికా కూడా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్‌ టై కాగా జరిగిన సూపర్ ఓవర్‌లో పాక్‌పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్‌-8కు చేరగా.. పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా.. ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+