భారత క్రికెట్ కు చిచ్చర పిడుగు దొరికాడోచ్.. !!
భారత క్రికెట్ కు ఓ చిచ్చర పిడుగును అందించిందీ ఏడాది. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొని 35 బంతుల్లోనే అజేయ శతకం బాదాడు. అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. 14 సంవత్సరాల వయస్సులో అతను సాధించిన ఈ అద్భుత ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్లో అతిపిన్న వయస్కుడిగా అరంగేట్రం చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన అత్యంత పిన్న వయస్కుడు కూడా అతనే. ఈ ఘనత సాధించిన కొద్ది రోజులకే ఈ అద్భుత శతకం నమోదైంది. 2024 జనవరిలో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడి, అతిపిన్న భారత ప్రొఫెషనల్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అప్పటినుంచి అతని పేరు 'రికార్డులు'కు పర్యాయపదం అయింది. క్రికెట్లో రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాడు.

అతని రికార్డుల జాబితాలో.. అత్యంత పిన్న వయస్కుడైన లిస్ట్ ఏ సెంచరీ, లిస్ట్ ఏ క్రికెట్లో వేగవంతమైన 150 పరుగులు, అతిపిన్న వయసు టీ20 సెంచరీ, యూత్ వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు, ఐపీఎల్లో వేగవంతమైన భారత సెంచరీ ఉన్నాయి. ఇవన్నీ 15 ఏళ్లు నిండకముందే సాధించాడు. చిన్న వయసులోనే పరుగులు, బౌండరీలను అలవోకగా కొట్టే అతని సామర్థ్యం అద్భుతం. మెరుపు వేగవంతమైన బ్యాట్ స్పీడ్, అసాధారణ గ్రిప్, శక్తివంతమైన డౌన్స్వింగ్తో షాట్ ఆడే సత్తా అతని సొంతం.
ఎలాంటి బౌలర్లనైనా సులభంగా ఎదుర్కొంటాడు. క్రికెట్‌ను ఆరాధించే ఈ దేశంలో ఈ గణాంకాలు వైభవ్‌ను ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేశాయి. చాలామంది ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్న తర్వాతే ఈ స్థాయిలో గుర్తింపు పొందుతారు. వైభవ్ సూర్యవంశీ మాత్రం దీనికి భిన్నం. ఈ వేగం.. అతనికి స్టార్డమ్ ను తెచ్చిపెట్టింది. దేశ క్రికెట్ చరిత్రలో వినోద్ కాంబ్లీ ఎంత వేగంగా గుర్తింపు పొందాడో.. అంతే వేగంగా తెరమరుగు అయ్యాడు. పృథ్వీ షా ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఓ పాఠంగా నేర్చుకోవాల్సి ఉంటుంది వైభవ్ సూర్యవంశీకి.
ఎనిమిది నెలల వ్యవధిలో వైభవ్ దేశంలో అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ సెంచరీ తర్వాత అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు రాత్రికి రాత్రే 6 లక్షల నుంచి 1.2 మిలియన్లకు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. తనపై ఉన్న ఈ అంచనాలను అందుకోవడం, ఒత్తిళ్లను ఎదుర్కొనడం, ఆందోళన లేకుండా టెక్నికల్ గా తన బ్యాటింగ్ ను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడం అతని ముందున్న సవాళ్లుగా చెప్పుకోవచ్చు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications