Ind vs SA: అభిషేక్ శర్మను తప్పిస్తారా ? తేల్చేసిన టీమిండియా కోచ్..!
టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026)లో ఓవైపు భారత్ వరుస విజయాలు సాధిస్తుంటే.. మరోవైపు వరుస డకౌట్లతో విసుగెత్తిస్తున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు సూపర్ 8లో అవకాశం ఇస్తారా లేక పక్కనబెడతారా అన్న చర్చ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ముఖ్యంగా జట్టులో స్ధానం కోసం గట్టి పోటీ నెలకొన్న పరిస్ధితుల్లో అభిషేక్ శర్మకు బదులుగా మరో బ్యాట్స్ మెన్ కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ (morne morkel) దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
అభిషేక్ శర్మను తప్పించాలనే డిమాండ్లు నానాటికీ ఎక్కువవుతున్నా.. టీమిండియా మేనేజ్ మెంట్ మాత్రం అతనిపై ఇంకా నమ్మకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ వంటి ఆటగాడు.. ఎన్నిసార్లు విఫలమైనా తనదైన రోజున మాత్రం జట్టును కచ్చితంగా ఒంటి చేత్తో గెలిపించి తీరుతాడని కోచ్ లు భావిస్తున్నారు. దీంతో తాజా ప్రెస్ మీట్ లో భారత బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ అభిషేక్ శర్మను సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు తప్పిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చాడు.

తమ గ్రూపులో అభిషేక్ ను తప్పించే అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని మోర్క్ మోర్నెల్ తేల్చేశాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడని, ఇప్పటివరకు టోర్నమెంట్లో అదృష్టవశాత్తూ అభిషేక్ మీరు కోరుకున్న పరుగులు చేయకపోవడంతో ఇతర ఆటగాళ్ళు నిలబడి ఉన్నారని మోర్కెల్ తెలిపాడు. ఇప్పుడు ప్రపంచ కప్‌లో చాలా ముఖ్యమైన దశలో ఉన్నామని, అతను ఖచ్చితంగా నిరూపించుకుంటాడని తాను ఖచ్చితంగా భావిస్తున్నట్లు తెలిపాడు. జట్టుకే కాదు, ఆట చూసే ప్రేక్షకులందరికీ అభిషేక్..తన ఆటతో మజా పంచుతాడని, తామూ దాన్ని చూసేందుకు ఇష్టపడతామని తెలిపాడు. అతను నెట్స్‌లో బంతిని బాగా కొడుతున్నాడని, మంచి ఆరంభాన్ని తీసుకోవడం మాత్రమే ముఖ్యమని వెల్లడించాడు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications