వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ వ్యూహం?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ వ్యూహం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఆయన వ్యూహం ఉండే అవకాశం ఉంది. పార్టీ విధివిధానాల్లో ఆ అంశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. మెల్లగా తెలంగాణలో కాలు పెట్టేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో వైయస్ జగన్ అభిమానుల సమావేశం జరిగింది. దానికి ఏ విధమైన ఆటంకాలు ఎదురు కాలేదు. ఈ సమావేశానికి హాజరైన నాయకుడు గోనె ప్రకాశ రావు తెలంగాణపై వైయస్ జగన్ వ్యూహం ఎలా ఉండబోతుందో సూచనప్రాయంగా చెప్పారు. జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా రెండు ప్రాంతాల్లో తమ పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణపై వ్యతిరేకత ప్రదర్శించే వైఖరితో వైయస్ జగన్ లేనట్లు కనిపిస్తోంది.

తెలంగాణ ప్రజలకు నచ్చజెప్పే పద్ధతిలో జగన్ వ్యూహం ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా ఇది ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వ్యూహమే. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే, ఇచ్చేదీ తెచ్చేదీ తాను కాదని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించే శక్తి తనకు లేదని ఆయన చెప్పే అవకాశాలున్నాయి. పార్టీ విధివిధానాల్లో కూడా ఇదే విధమైన వైఖరి తెలంగాణపై చేర్చే అవకాశం ఉంది. ఆ రకంగా తెలంగాణ ప్రజల వ్యతిరేకతను తగ్గించుకోవాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

కాగా, తెలంగాణలో తలపెట్టిన సహాయ నిరాకరణకు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన తెలంగాణ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలున్నాయి. తెలుగుదేశంలోని తెలంగాణ ప్రాంత నాయకుల మాదిరిగానే వైయస్ జగన్ వర్గానికి చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ కోసం గొంతు పెంచే అవకాశం ఉంది. వైయస్ జగన్ మాత్రం నోరు విప్పకుండా వారి చేత తెలంగాణపై మాట్లాడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, తెలంగాణపై జగన్ వైఖరి మాత్రం కట్టె, కొట్టె, తెచ్చే అనే విధంగా ఉండబోదని తెలుస్తోంది.

English summary
YS Jagan's strategy on Telangana will not be clear. He may throw the burden on Central Government. His Telangana region leaders may act like TDP Telangana region leaders on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X