వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడింటిపై ఆశలు, ఓడే సెగ్మెంట్లపై సందేహాలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరులో జరుగుతున్న ఉప ఎన్నికల్లోని ఏడు స్థానాల్లో మూడు స్థానాల గెలుపుపై అధికార కాంగ్రెసు పార్టీ ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఓడే స్థానాల్లోనూ ఏఏ స్థానాల్లో నిలబడతామనే చర్చ కాంగ్రెసులో జోరుగా జరుగుతోందంట. ఓటరు తీర్పుపై అధికార పక్షంలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నా ఓటరు నాడి పట్ల వారిలో ఆందోళన పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సంగతెలా ఉన్నా ఓడిన సెగ్మెంట్లలో రెండు, మూడు స్థానాల్లోకి ఎవరు వెళ్తారన్న సందేహం అధికారపక్షాన్ని వీడటం లేదట. ఎన్నికల ఫలితాల ప్రభావం పార్టీపై పడే వీలుండటంతో విజయం కోసం మంత్రులు చెమటోడ్చారు. బిజెపి, టిఆర్ఎస్‌లకు ఓట్లు చీలడంతో మహబూబ్ నగర్‌లో, జూపూడిపై వ్యతిరేకతతో కొల్లాపూర్‌లో పార్టీ గట్టెక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కొవూరు నియోజకవర్గంలో క్రమంగా పార్టీ పరిస్థితి మెరుగు పడుతోందని, ఎన్నికల రోజుకు అది మరింత మెరుగు పడిందని, దీంతో గెలుపు ఖాయమని భావిస్తున్నారట. ఇక మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఉంది. నాగర్ కర్నూల్‌లో నాగం జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా, ఆయన కూడా సెంటిమెంట్‌పైనా పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కనిపించట్లేదు. ఆదిలాబాద్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సెంటిమెంట్‌ను అధిగమించడంపై అధికారపక్షం దృష్టి సారించింది. ఇక, సీమాంధ్ర నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక స్థానం కోవూరు కూడా కాంగ్రెస్‌కు కీలకం కానున్నది. ఈనెల 9న కోవూరులో కిరణ్ ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి, కృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిలతో కిరణ్ తాజాగా సమీక్షించారు. ఆ సమీక్ష తర్వాత ఇక్కడ నుంచి తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో గట్టి పోటీ ఉన్నందున ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని భావించడం లేదని కిరణ్ కూడా భావిస్తున్నారు.

English summary
Congress Party cadre is thinking that party will win in Kovvur, Kollapur and Mahaboobnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X