చాట్ జీపీటీ లేకుండా బిడ్డను పెంచడం ఊహించలేను - సామ్ ఆల్ట్మాన్
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తన కొడుకు పుట్టిన తొలి మాసాల్లో చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నట్లు వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫిబ్రవరిలో భర్త ఆలివర్ మల్హెరిన్‌తో కలిసి బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్‌మన్.. పేరెంట్‌హుడ్ సవాళ్లకు కృత్రిమ మేధస్సుపై ఆధారపడినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోజువారీ పెంపకం సమస్యలపై ధైర్యం కోసం AI సాధనాన్ని ఆశ్రయించానని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ లేకుండా పసిబిడ్డను పెంచడం ఎలాగో ఊహకు అందడం లేదు" అని.. అయితే ప్రజలు చాలా కాలం పాటు సమస్య లేకుండానే చేసారని అంగీకరించారు.
ఈ సందర్భంగా ఒక పార్టీలో జరిగిన సంఘటనను ఆల్ట్‌మన్ గుర్తు చేసుకున్నారు. ఆరు నెలల మరొ బిడ్డ పాకుతున్నట్లు ఒక తల్లి చెప్పింది. తన కొడుకు అలా లేడని ఆందోళన చెంది.. వెంటనే బాత్రూమ్కు పరుగెత్తి, తన బిడ్డ పెరుగుదల సాధారణమేనా అని ఆతృతగా చాట్‌జీపీటీలో అడిగినట్టు వెల్లడించారు. అంతే కాకుండా ఉదయం తన బిడ్డను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలా? ఇది సరియైనదేనా?” అని టైప్ చేసినట్లు ఆల్ట్‌మన్ వివరించారు. అందుకు చాట్‌జీపీటీ “మీ కొడుకు పెరుగుదల సాధారణమే" అని జవాబిచ్చిందన్నారు.

ఇక సామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలు ఆన్లైన్లో తక్షణమే ప్రతిస్పందనలను రేకెత్తించాయి. పెంపకంలో AI మార్గదర్శకత్వం కోసం కృత్రిమ మేధస్సుపై ఆధారపడినందుకు చాలా మంది ఆయన్ను విమర్శించారు. ఒక వినియోగదారుడు, “మానవ చరిత్రలో ఎప్పటి నుంచో జరుగుతున్న పనికి ఆయనకు చాట్‌జీపీటీ అవసరం” అని రాశారు. మరొకరు, “చరిత్రలో AIకి ముందు 120 బిలియన్ల శిశువులు జన్మించారు... ఎంత కురచ దృష్టి!” అని వ్యాఖ్యానించారు.
మూడవ వినియోగదారుడు, “ఆయన తనను తాను తెలివి తక్కువవాడిని అని చెప్పినట్లే,” అని రాస్తూ, పిల్లల పెంపకం సలహాల కోసం చాట్‌జీపీటీపై ఆధారపడే వారెవరైనా "తల్లిదండ్రులుగా మారడాన్ని పునరాలోచించుకోవాలి" అని అన్నారు. అయితే, ఆల్ట్‌మన్ గతంలోనే తల్లిదండ్రులుగా మారిన తర్వాత కృత్రిమ మేధస్సు పట్ల తన దృక్పథం మారిందని వివరించారు. ఆడమ్ గ్రాంట్‌తో జరిగిన 'రీ:థింకింగ్’ పాడ్‌కాస్ట్ జనవరి ఎపిసోడ్లో, తన బిడ్డ AI సర్వవ్యాప్తంగా ఉండే ప్రపంచంలో పెరుగుతాడని ఆయన పేర్కొన్నారు.
నా బిడ్డ AI కన్నా తెలివైనవాడిగా పెరగడు” అని ఆల్ట్‌మన్ తెలిపారు. “భవిష్యత్తులో పిల్లలు AI ఉన్న ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకుంటారు” అని ఆయన అన్నారు.
-
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications