భారత ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త చెప్పిన సత్య నాదెళ్ల- మోదీతో భేటీ తర్వాత అనూహ్య నిర్ణయం
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల.. భారత్ లో ప్రత్యక్షం అయ్యారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. అత్యంత భారీ పెట్టుబడిని ప్రకటించారు. దీని విలువ 17.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీతో పోల్చుకుంటే సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. AI-first future ప్రాజెక్ట్ లో భాగంగా సత్య నాదెళ్ల ఈ ఇన్వెస్ట్ మెంట్ పెట్టనున్నారు. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన వెంటనే ఈ విషయాన్ని ప్రకటించారు.
మోదీతో జరిగిన భేటీలో Artificial Intelligenceపై చర్చించారు. దేశంలో దాదాపు అన్ని విభాగాల్లోనూ AIని విస్తృతంగా వినియోగిస్తోన్న ప్రస్తుత పరస్థితుల్లో దీన్ని మరింత విస్తరించడానికి గల అవకాశాలు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం- సత్య నాదెళ్ల తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను దీనికి జత చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారాయన. దేశంలో ఏఐ విస్తరించడానికి గల అవకాశాలపై విస్తృతంగా చర్చించామని, ఈ దిశగా తమ ఇద్దరి మధ్య స్ఫూర్తిదాయకమైన సంభాషణ జరిగిందని సత్య నాదెళ్ల వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో భాగంగా భారత్ లో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టబడులు పెట్టనున్నామని వెల్లడించారు. ఆసియా దేశాల్లో ఇదే తమ అతిపెద్ద పెట్టుబడి అవుతుందని వ్యాఖ్యానించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఈ రంగంలో దేశం పూర్తి సార్వభౌమత్వాన్ని సాధించడానికి తమ పెట్టుబడి సహాయపడుతుందని సత్య నాదెళ్ల తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. AI లో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూపులు సారిస్తాయని, ఈ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు త్వరలోనే వస్తాయని వ్యాఖ్యానించారు.
Thank you, PM @narendramodi ji, for an inspiring conversation on India’s AI opportunity. To support the country’s ambitions, Microsoft is committing US.5B—our largest investment ever in Asia—to help build the infrastructure, skills, and sovereign capabilities needed for… pic.twitter.com/NdFEpWzoyZ
— Satya Nadella (@satyanadella) December 9, 2025
మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ఈ పెట్టుబడుల వల్ల వచ్చే అవకాశాలను యువత అందిపుచ్చుకుంటుందని, మెరుగైన ప్రపంచం కోసం AI ని ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, AI నైపుణ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం వివిధ రంగాలలో సురక్షిత డేటా వ్యవస్థలకు వ్యూహాత్మకంగా బలోపేతం చేయడంపై మైక్రోసాఫ్ట్ దృష్టి సారించే అవకాశం ఉంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications