Akhanda 2 Twitter Review: బాలయ్య విస్పోటనం.. పోతారు.. మొత్తం పోతారు..!
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ-2 చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన నాలుగో చిత్రం ఇది. గతంలో సింహా, లెజెండ్, అఖండ, అఖండ-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అఖండ 2 గత వారమే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 12 న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధం అయింది. ఈ మేరకు డిసెంబర్ 11 నుంచే ప్రీమియర్స్ పడ్డాయి.
నాలుగేళ్ల క్రితం రిలీజైన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందంటే ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఇక అఖండ 2 ట్విట్టర్ రివ్యూ చూస్తే.. బాలయ్య శివతాండవమే అంటున్నారు. బాలయ్య అఘోర గెటప్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ , ఆరా.. స్క్రీన్ పై ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
ముఖ్యంగా అఖండ 2 లో ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.. అలాగే ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ కు థియేటర్లు బద్దలవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూర్తిగా డివోషనల్ మూమెంట్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్య- బోయపాటి క్రేజీ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నట విశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా అఘోర పాత్ర చాలా ఏళ్లపాటు గుర్తుండిపోతుందట. ఇక మూవీలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించారు. జాజికాయ సాంగ్ లో సంయుక్త మీనన్ స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే విలన్ గా ఆది పినిశెట్టి భయపెట్టారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అయింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications