APSRTC: టెన్త్ విద్యార్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్- ఈ బస్సుల్లో ఫ్రీగా..!
ఏపీలో పదో తరగతి పరీక్షలకు (SSC Exams)హాజరవుతున్న విద్యార్ధులకు ఆర్టీసీ (APSRTC) శుభవార్త చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే వారికి ఇది ఉపయోగపడబోతోంది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని
అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించబోతున్నారు. ఈ మేరకు విద్యార్ధులు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ తెలిపింది.

పదో తరగతి విద్యార్ధులు ఇలా పరీక్షలకు వెళ్లేందుకు చేసే ఉచిత ప్రయాణానికి మూడు రకాల బస్సుల్ని అనుమతిస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి వెళ్లేందుకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్ధులు నేరుగా ఇంటి దగ్గరే బస్సు ఎక్కి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో పాటు తిరిగి వచ్చేందుకు కూడా వీలు కలగబోతోంది. పరీక్షలు జరిగినన్ని రోజులు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications