Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెలకు రూ.1,05,280 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!

బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్ట్రీమ్లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 20 నుంచి జనవరి 5, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే, ఫైనాన్స్ & క్రెడిట్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ నియామకం ఒక అద్భుత అవకాశంగా నిలుస్తోంది. అర్హతలు ఉన్న వారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది. పోస్టు వైజ్ ఖాళీల సంఖ్య, కేటగిరీ వర్గీకరణ, ఎంపిక శాతాలు, పరీక్ష సిలబస్ మరియు ఇతర సవివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవడం మంచిది. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

bank-of-india-notification-for-514-jobs-with-huge-salary

మొత్తం పోస్టులు..

514

ఖాళీల వివరాలు..

ఈ నియామక ప్రక్రియలో వివిధ స్కేల్స్‌లో ఖాళీలు ఉన్నాయి.

క్రెడిట్ ఆఫీసర్ (ఎస్‌ఎంజీఎస్‌-4) : 36 పోస్టులు

క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-3) : 60 పోస్టులు

క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-2) : 418 పోస్టులు

ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు & అనుభవం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, MBA / PGDBM, పోస్టు గ్రాడ్యుయేషన్, CA / CMA, సంబంధిత ఫీల్డ్‌లో నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అనుభవం తప్పనిసరి పోస్టు స్థాయిని బట్టి అనుభవ సంవత్సరాలు మారుతాయి.

దరఖాస్తు విధానం & ముఖ్య తేదీలు..

దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 20, 2025

చివరి తేదీ: జనవరి 5, 2026

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్

అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుము..

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.850

ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు: రూ.175

ఈ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ఎంపిక విధానం..

ఈ నియామకానికి రెండు దశల్లో ఎంపిక ఉంటుంది:

ఆన్‌లైన్ రాత పరీక్ష

పర్సనల్ ఇంటర్వ్యూ (వ్యక్తిగత ఇంటర్వ్యూ)

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులనే ఇంటర్వ్యూకు పిలుస్తారు.

రాత పరీక్ష వివరాలు..

మొత్తం ప్రశ్నలు: 150

మొత్తం మార్కులు: 150

పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు

నెగటివ్ మార్కింగ్: ఉంది

విభాగాల వారీగా ప్రశ్నలు..

ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 25 ప్రశ్నలు (25 మార్కులు)

రీజనింగ్ అబిలిటీ - 25 ప్రశ్నలు (25 మార్కులు)

క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు (25 మార్కులు)

ప్రొఫెషనల్ నాలెడ్జ్ - 75 ప్రశ్నలు (75 మార్కులు)

జీతభత్యాలు..

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం చెల్లిస్తారు:

ఎంఎంజీఎస్‌-2:

రూ.64,820 నుంచి రూ.93,960 వరకు

ఎంఎంజీఎస్‌-3:

రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు

ఎస్‌ఎంజీఎస్‌-4:

రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు

జీతంతో పాటు డీఏ, హెచ్ఆర్‌ఏ, మెడికల్, పెన్షన్, ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎందుకు ఈ అవకాశం ప్రత్యేకం?

కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో శాశ్వత ఉద్యోగం

ఉన్నత స్థాయి జీతం & కెరీర్ గ్రోత్

బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన భవిష్యత్

ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్నవారికి గొప్ప అవకాశం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+