నెలకు లక్షకు పైగా జీతంతో "సుప్రీం కోర్టు"లో ఉద్యోగాలు..
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం "సుప్రీం కోర్టు" గోల్డెన్ ఛాన్స్ అందిస్తుంది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాగా అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 7, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను ఒక సంవత్సరం కాలపరిమితితో భర్తీ చేయనున్నారు. పనితీరు ఆధారంగా ఒప్పందాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుందని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, నిబంధనలను పరిశీలించిన తర్వాతే అప్లై చేయాలని న్యాయస్థానం సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

విద్యార్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ (LLB) పూర్తి చేసి ఉండాలి
డిగ్రీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గుర్తింపు తప్పనిసరి
న్యాయ పరిశోధన, కేస్ లా విశ్లేషణపై అవగాహన ఉండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు
తాజాగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
వయస్సు పరిమితి..
ఫిబ్రవరి 7, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు
కనిష్టం: 20 సంవత్సరాలు
గరిష్ఠం: 32 సంవత్సరాలు
మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి
రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాలి
రుసుము ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే స్వీకరించబడుతుంది.
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో
ఆన్లైన్ రాత పరీక్ష
ఇంటర్వ్యూ
రాత పరీక్షలో న్యాయ అవగాహన, లాజికల్ రీజనింగ్, కేస్ లా విశ్లేషణ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
జీతభత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు
నెలకు రూ.1,00,000 వేతనం
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు లభిస్తాయి.
ఉద్యోగ ప్రాధాన్యత..
సుప్రీంకోర్టులో లా క్లర్క్‌గా పని చేయడం ద్వారా
సీనియర్ న్యాయమూర్తులతో నేరుగా పని చేసే అవకాశం
కీలక కేసులపై పరిశోధన అనుభవం
భవిష్యత్‌లో లిటిగేషన్, జ్యుడీషియల్ సర్వీసెస్‌కు బలమైన పునాది లభిస్తుందని న్యాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications