ఇట్స్ అఫిషియల్.. ఇక 48 గంటలే.. 'అఖండ 2' రుద్ర తాండవమే..
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ 'అఖండ 2'.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఈ నెల 12 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 11 న ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ నెల 5 న విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదాలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలిగిపోయిన నేపథ్యంలో మూవీ రిలీజ్ కానుంది.
All set for the Divine Destruction at the box office 🔥
— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025
Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱
BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో ఇదివరకే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దాంతో అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఎప్పటిలాగే బాలయ్య భారీ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్ తో ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో బాలయ్య అఘోరా పాత్రలో నటవిశ్వరూపం చూపించారు. అయితే ఈ మూవీ ముందుగా అనుకున్న విధంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. రాత్రికి రాత్రే మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

అయితే ఎట్టకేలకు డిసెంబర్ 12 న చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. డిసెంబర్ 11 న ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ మూవీలో బాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్ పోషించారు. ఆయన సరసన మూవీలో సంయుక్త మీనన్ నటించారు. విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications