ప్రముఖ నటి వాష్‌రూమ్ లో కెమెరా.. సీక్రెట్ గా వీడియో తీసి..!
సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు అంటూ మీద పడి పోతుంటారు. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై జరిగిన వికృత చేష్టలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆ నటి వాడుతున్న టాయిలెట్ లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు ఓ వ్యక్తి. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానంటూ బెదిరించ సాగాడు. ఈ నేపథ్యంలో ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బుల్లితెర ప్రముఖ నటి(32)కి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన సెలబ్రిటీ ఉమెన్ క్రికెట్ కు ఆ నటి హాజరైంది. అయితే ఆమె వాష్ రూమ్ లో ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాను పెట్టి వీడియోలను రికార్డు చేశాడు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఈ వీడియోలను చూపించి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడు ఆ వీడియోలను ఫస్ట్.. ఆ నటి ఫ్రెండ్ ఇన్ స్టా ఖాతాకు పంపించాడు. అది నటి అకౌంట్ అని భావించి బెదిరింపులకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను వైరల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 సీతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇన్ స్టా ఖాతా ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications