ఇదేంటి వెంకీ సరసన ఫ్లాప్ హీరోయినా..?
టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అనిల్ రావిపూడి, బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో ఏకంగా రూ.360 కోట్లు కొల్లగొట్టి, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అనిల్.. ఇప్పుడు తన 'లక్కీ హీరో' విక్టరీ వెంకటేష్‌తో ఐదోసారి జతకడుతున్నారు.
టైటిల్‌తోనే సంచలనం..
ఈ సినిమా టైటిల్ వింటేనే అందరూ ఆశ్చర్యపోతారని అనిల్ స్వయంగా చెప్పడంతో, ఆ 'విచిత్రమైన జర్నీ' ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక సరికొత్త మేనరిజంతో, మునుపెన్నడూ చూడని వినోదాన్ని పండించేందుకు అనిల్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టులోకి బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎంట్రీ ఇస్తుందనే వార్త ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, సోషల్ మీడియాలో ఆమెపై 'ఐరన్ లెగ్' అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

నెట్టింట భిన్నాభిప్రాయాలు
వరుస హిట్లతో దూసుకుపోతున్న మీరు, ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్న టైంలో రిస్క్ చేయడం అవసరమా? అని కొందరు హెచ్చరిస్తున్నారు.మరికొందరు మాత్రం, "అసలు సెంటిమెంట్లకు తావులేదు! అనిల్ రావిపూడి చేతిలో పడితే ఎవరైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే. పూజా హెగ్డేకి ఇది గ్రాండ్ కమ్ బ్యాక్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రతిభకు సెంటిమెంట్ తో పనిలేదు.
సరైన పాత్ర పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!" - ఇదీ అనిల్ అభిమానుల మాట. పూజా హెగ్డే ఈ ప్రాజెక్టులో భాగమైతే, అది ఆమె కెరీర్‌కు మలుపు తిప్పే అవకాశం ఉంది. అలాగే వెంకీ-అనిల్ కాంబోలో వచ్చే ఐదో చిత్రం కాబట్టి, సెంటిమెంట్ల కంటే కంటెంట్‌కే ప్రాధాన్యత ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదేమైనా 2027 సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం మాత్రం ఖాయం.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications