ప్రేమలో పడాలని ఉంది.. ఆ హీరోయిన్‌తో మనసులో మాట బయటపెట్టిన ప్రభాస్!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే కేవలం సినిమాలే కాదు.. ఆయన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న కూడా నిత్యం హాట్ టాపిక్‌గా ఉంటుంది. ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్, వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్నారే తప్ప పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. తన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఆయన ఎప్పుడూ నవ్వుతూ తప్పించుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తన మనసులోని మాటను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు ప్రేమలో పడాలని ఉందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
'కపుల్ ఫ్రెండ్లీ' ప్రమోషన్స్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూ
యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యువీ క్రియేషన్స్ ప్రభాస్‌తో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాటు సంతోష్ శోభన్, మానస, సినిమా యూనిట్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ సరదాగా సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు.

ప్రేమ గురించి మానస అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానం
ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ మానస వారణాసి ప్రభాస్ ని ఉద్దేశించి "మీకు లవ్ అంటే ఏంటి?" అని అడిగింది. దానికి ప్రభాస్ నవ్వుతూ "ఇది నీ పర్సనల్ క్వశ్చన్ కదా" అని చమత్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ "మీ సినిమా చూశాక నాకూ ప్రేమలో పడాలని అనిపించింది" అని చెప్పారు. గీతాంజలి లాంటి సినిమాలు చూసినప్పుడు కూడా తనకు ఇలాగే అనిపించేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో ప్రభాస్ మనసులో కూడా ప్రేమ కోసం ఒక స్థానం ఉందని స్పష్టమైంది.
ప్రేమలో పడాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన ప్రభాస్ pic.twitter.com/4OTbiffFoZ
— ChotaNews App (@ChotaNewsApp) February 20, 2026
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'డార్లింగ్' వ్యాఖ్యలు
ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి ప్రస్తావన వస్తే సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రభాస్, నేరుగా తనకు ప్రేమలో పడాలని ఉందని చెప్పడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ కి జోడీగా ఎవరు రాబోతున్నారో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ అన్న మనసు పారేసుకుంటే చూడాలని ఉంది", "త్వరలోనే డార్లింగ్ పెళ్లి వార్త వింటామేమో" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ అన్న మనసు దోచుకునే ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు












Click it and Unblock the Notifications