54 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయనున్న శ్రీలీల..!
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల 'పెళ్లి సందడి' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ 'ధమాకా' తర్వాత ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ మళ్లీ ఈ బ్యూటీకి దక్కలేదు. మధ్యలో పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. గుంటూరు కారం మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ఆడిపాడినా ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. 'పుష్ప-2'లో 'కిస్సిక్' సాంగ్ తో మెరిసినా, అందులో ఆమె లీడ్ రోల్ కాదు. దీంతో ప్రస్తుతం శ్రీలీల కెరీర్ క్లిష్టమైన దశలో ఉంది. ఆమెకు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ అవసరం.
ఇక ఇటీవల శ్రీలీల 'పరాశక్తి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కోలీవుడ్ లో తనదైన ముద్ర వేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా చేస్తోంది. ఈ మూవీపైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. అయితే తాజాగా కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ కొట్టేసిందీ బ్యూటీ. 54 ఏళ్ల అజిత్ సరసన శ్రీలీల జోడిగా నటించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్.

ఈ మేరకు మలేషియా రేసింగ్ ఈవెంట్ లో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తో కలిసి శ్రీలీల సందడి చేసింది. ఈ మేరకు ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక సమ్మర్ లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications