Fake : ఆ వీడియోకు పంజాబ్‌కు సంబంధం లేదు... అది జియో టవర్ కాదు...
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసన తెలియజేస్తున్న రైతులు సెల్‌ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెల్ టవర్లను ధ్వంసం చేయవద్దని స్వయంగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సెల్‌ఫోన్ టవర్‌కు నిప్పంటించిన ఫోటో,వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. 'రైతు ఉద్యమ ఎఫెక్ట్... కాలిపోతున్న జియో టవర్..' అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అయితే వాస్తవమేమిటంటే ఈ వీడియోలో కాలిపోతున్నది జియో టవర్ కాదు. అసలు ఇది పంజాబ్‌కి సంబంధించిన వీడియో అంతకన్నా కాదు.

2017లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తగలబడిన టవర్ ఇది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి టవర్ తగలబడింది. అప్పట్లో ఈ వార్తను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ప్రస్తుతం పంజాబ్‌లో రైతులు సెల్‌ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.
ఇది పంజాబ్‌లో జియో టవర్‌ను తగలబెట్టిన ఫోటోగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆ కాలిపోతున్న టవర్ ఫోటో డెహ్రాడూన్‌లో జరిగిన ఘటనకు సంబంధించినది. దీనికి పంజాబ్ రైతు ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు.

Fact Check
వాదన
పంజాబ్‌లో తగలబడ్డ జియో టవర్
వాస్తవం
అది 2017లో డెహ్రాడూన్‌లో తగలబడిన టవర్
రేటింగ్
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications