వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుజారా ది వాల్-2

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pujara
వన్డే, టి-20 వంటి ఎన్ని ఫార్మట్లు వచ్చినా క్రికెట్ అంటే టెస్టు క్రికెట్టేనని ఏ అభిమానిని అడిగినా చెబుతాడు. వన్డేలకు, టి-20 ఫార్మట్లు ఆడగల ఆటగాళ్లు చాలానే ఉన్నారు. కానీ బంతి గమనం ఎలా ఉన్నా మోదగలగడం, మెరుగైన పాదాల కదలికలతో పొందికగా సాంకేతికంగా బ్యాటింగ్ చేయగలగడం, దీర్ఘ కాలం ఆడుతూ, దీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పడం కేవలం టెస్టు క్రికెట్లోనే సాధ్యం. క్రికెట్ కు ప్రాణమైన టెస్టు క్రికెట్ బతికి బయట కట్టాలంటే అలాంటి వారికోసం సంప్రదాయవాదులు ఎదురు చూస్తుంటారు. రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లు టెస్టు ఫార్మట్లో ఎంతటి హీరోలో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ద్రావిడ్ ఎంత ఒత్తిడి ఉన్న సమయంలోనైనా క్రీజులో నిలదొక్కుకొని ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించటంలో దిట్ట. ద్రావిడ్ క్రీజులో పాతుకూపోయాడంటే ప్రత్యర్థి జట్టు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అయిన ఆస్ట్రేలియాతో ఆడుతుంటే ఎంతటి వారైనా ఆందోళనకు గురవుతారు. కానీ అదే అత్యుత్తమ జట్టు మాత్రం హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ లక్ష్మణ్ చూసి ఆందోళన చెందుతుంది. అతడు ఉంటే గెలవటం కష్టం అని మానసికంగా సిద్ధం అవుతుంది. అలాంటి క్రీడాకారుల కేరీర్లు ముగుస్తున్న దశలో ఉంది. భారత్ లో టెస్టు క్రికెట్ రుచి చూపించటానికి మరో ఆటగాడు సిద్ధమయ్యాడు. అతడే ఆస్ర్టేలియా రెండో టెస్టులో సచిన్ తో కలిసి 72 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన చటేశ్వర్ పుజారా. ఇన్ స్టంట్ క్రికెట్ కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో టెస్టు క్రికెట్ బ్రతకాలంటే పుజారాలాంటి ఆటగాళ్లు అవసరం. రెండో ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ అవుట్ కాగానే ఫస్ట్ డౌన్ లో ద్రావిడ్ కు బదులు పుజారా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ద్రావిడ్ మాదిరిగానే ది వాల్ అని నిరూపించుకున్నాడు. వికెట్లకు రెండువైపులా బంతులను మోది తనేంటో నిరూపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఆడకుండానే ఎంపర్ వివాదాస్పద నిర్ణయానికి క్రీజు వదలాల్సి వచ్చినా ఎలాంటి ఆవేశానికి లోను కాలేదు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లోకి ఫాంలో లేని యువరాజ్ ను తీసుకోక పోవటంతో పుజారాను జట్టులోకి తీసుకున్నారు. అయితే లక్ష్మణ్ వెన్నునొప్పి కారణంగా తప్పుకోవటంతో పుజారాకు అవకాశం వచ్చింది. ద్రావిడ్ లోటును భర్తీ చేస్తాడన్న నమ్మకం మాజీ క్రికెటర్లకు కలిగించి ఈ కుర్రాడు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ కు చెందినవాడు. 25-జనవరి-1988లో పుట్టాడు. పూర్తి పేరు ఛటేశ్వర్ అరవింద్ పుజారా. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడినప్పటికీ బ్యాటింగ్ లో వేగం ఉండదనే విమర్శ ఉండేది. కాని ఆస్ట్రేలియాతో ఆతని మ్యాచ్ చూసిన వారెవరూ దాన్ని ఒప్పుకోరు. సౌరాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన పుజారా 49 ఆటలు ఆడి 3925 పరుగులు చేశాడు. 60.38 రన్ రేటు కలిగి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఒక్క నెలలోనే మూడు సెంచరీలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. కుడిచేయివాటం బ్యాట్స్ మెన్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X