వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు

By Pratap
|
Google Oneindia TeluguNews

London Metropolitan University
లండన్: లండన్‌లో భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. తీవ్రమైన వ్యవస్థాగత వైఫల్యాల కారణంగా ఇంగ్లండ్‌లోని లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో (ఎల్ఎంయూ) విదేశీ విద్యార్థులను చేర్చుకోడానికి వీల్లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు దాని లైసెన్సును రద్దు చేయడంతో దాదాపు 2,600 మంది విద్యార్థులను బయటకు పంపేశారు. యూకే బోర్డర్ ఏజెన్సీ (యూకేబీఏ) తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా రోడ్డున పడ్డారు. వీరిలో కొన్ని వందల మంది భారతీయులు ఉన్నారు. 60 రోజుల్లోగా వీరంతా ఇంగ్లండ్‌లోని వేరే విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించలేకపోతే, వారందరినీ సొంత దేశాలకు పంపేస్తారు.

ఇప్పటికే వీసాలు పొంది, ఎల్ఎంయూలో వచ్చేనెల నుంచి చదువుకోడానికి రావాల్సిన భారతీయ విద్యార్థుల వీసాలు రద్దవుతాయి. ఇటీవలి కాలంలో నిధుల కొరత సహా పలు రకాల సమస్యలను ఎల్ఎంయూ ఎదుర్కొంటోంది. కానీ, ప్రస్తుతమున్న విద్యార్థుల భవిష్యత్తే తమకు అత్యంత ప్రాధాన్యమైన విషయమని, వారికి కావల్సిన అన్నిరకాల సాయం చేస్తామని వర్సిటీ ఉపకులపతి మాల్కం గిల్లీస్ తెలిపారు. లైసెన్సు రద్దు వల్ల ప్రభావితమైన భారతీయ, ఇతర విద్యార్థులకు సాయం చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు.

ఎలాంటి తప్పు చేయని విద్యార్థులకు సాయం చేస్తామని, వారు వేరే విద్యాసంస్థల్లో చేరి చదువు పూర్తిచేయడానికి సహకరిస్తామని విశ్వవిద్యాలయాల శాఖ మంత్రి డేవిడ్ విల్లెట్స్ తెలిపారు. యూకేబీఏ, ఎన్‌యూఎస్‌లతో కలిసి పనిచేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఎల్ఎంయూ వీసా లైసెన్సు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని ఇమిగ్రేషన్ మంత్రి డేమియన్ గ్రీన్ తెలిపారు. విదేశీ విద్యార్థులు భారీ స్థాయిలో చెల్లించే ఫీజులే ఎల్ఎంయూతో పాటు ఇంగ్లండ్‌లోని పలు వర్సిటీలకు ప్రధాన ఆదాయవనరు.

డేవిడ్ కామెరాన్ ప్రభుత్వం హ యాంలో యూనివర్సిటీ రంగానికి నిధుల్లో కోత విధించడంతో పలు వర్సిటీలు అల్లాడుతున్నాయి. విద్యార్థుల్లో కొంతమందికి చిట్టచివరి సెమిస్టర్ మాత్రమే మిగిలి ఉండటం, ఇలాంటి సమయంలో తమను బయటకు పంపేయడంతో వారు వాపోతున్నారు. బ్రిటిషేతర విద్యార్థులలో ఈ విషయమై తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యార్థులు చెల్లించిన ప్రతిపైసా వారికి తిరిగివ్వాలని, నష్టపరిహారమూ చెల్లించాలని ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఏ) ప్రధాన కార్యదర్శి హార్సెవ్ బెయిన్స్ డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు విదేశీ విద్యార్థులు న్యాయబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

English summary
International students at the London Metropolitan University, who face deportation from the UK, protest on Downing Street Link to this video Walk through the campus of London Metropolitan University and the sense of loss is palpable. Every international student looks crushed after the north London university became the first in the UK to be stripped by the Home Office of its ability to sponsor foreign learners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X