హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బాహ్మణ యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడా? ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నప్పుడు ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడి, ప్రేమ వరకు, తర్వాత పెళ్ళి వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఎన్నో ఆస్ధులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంలో ఉన్న కార్తీక్ రెడ్డి కట్న కానుకలు పెద్దగా ఇవ్వని బ్రాహ్మణ యువతిని పెళ్ళి చేసుకోబోవడం ఏమిటని రెడ్డి కులపెద్ద్దలు ప్రశ్నిస్తున్నారు.
ప్రేమ అనేది సంపదల కంటే పెద్ద సంపద అన్న విషయం చాలా మందికి తెలిసిందే. తనయుడు కార్తీక్ ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నడన్న సంగతి తెలుసుకుని తల్లి సబితా రెడ్డి పెద్ద మనసుతో ఆ విషయాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో ఆ పెళ్ళిని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.