సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. పండుగను చేసుకోండి తియ్యగా!
సంక్రాంతి పండుగ అంటేనే అందరూ పిండి వంటలలో బిజీగా ఉంటారు. ఈ పండుగలో తప్పనిసరిగా చేసే సంప్రదాయ పిండివంటలలో బెల్లం అరిసెలు ముఖ్యమైనవి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే అరిసెలు సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అటువంటి బెల్లం అరిసెలు ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు
బియ్యం – 2 కిలోలు
బెల్లం – 1½ కిలోలు
నువ్వులు – 200 గ్రాములు
ఏలకుల పొడి – 1 టీ స్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
వంటనూనె – తగినంత

బియ్యపిండితో అరిసెల పిండి తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 12 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆరు గంటలకు ఒకసారి కడిగి ఆ నీరు పారబోసి, మళ్ళీ కొత్త నీటితో నానబెట్టాలి. ఆ తర్వాత నీరు వడగట్టి, నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఆరిన తర్వాత మెత్తగా పిండి చేసి జల్లెడ పట్టి ఉంచాలి. ఈ పిండి పూర్తిగా పొడిగా ఉండాలి. ఇదే మంచి అరిసెల రహస్యం.
బెల్లం పాకం, అరిసెల పిండి తయారీ
బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. వడకట్టి మళ్లీ మంటపై పెట్టి ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం సిద్ధమైన తర్వాత ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత తయారు చేసిన బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా బియ్యపిండిలో కలుపుతూ మృదువైన ముద్దలా చేయాలి. ఈ ముద్ద చాలా గట్టిగా కూడా కాకుండా, పలుచగా కూడా కాకుండా ఉండాలి.
అరిసెలను కాల్చే విధానం ఇలా
పొయ్యి వెలిగించి మంటపై కడాయిలో నూనె వేడి చేయాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి. లేదా నూనె రాసుకుని, ముద్దను తీసుకుని నువ్వుల్లో ముంచి నిదానంగా రౌండ్ గా ఒత్తుకోవాలి. అరిసెల ముద్దను ప్లాస్టిక్ కవర్ మీద గానీ, బాదం ఆకుల మీద గానీ ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి. దానిని నిదానంగా నూనెలోకి జారవిడిచి మెల్లగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
రుచికరమైన అరిసెల కోసం చిట్కాలు
కాలిన తర్వాత రెండు అరిసెల గంటెలతో మెల్లగా ఒత్తి అదనపు నూనె తీసేసి అరిసెలను ఆరబెట్టాలి. బియ్యపిండి పూర్తిగా పొడిగా ఉండాలి. బెల్లం పాకం తీగ పాకం దశలో ఉండాలి. నూనె మోస్తరు వేడి ఉండాలి. అరిసెలను నెమ్మదిగా వేయించాలి. ఈ చిట్కాలు పాటించి సంప్రదాయ పద్ధతిలో అరిసెలు చేస్తే బాగుంటాయి.
బెల్లం అరిసెలే సంక్రాంతి స్పెషల్
ఇలా చేసిన బెల్లం అరిసెలు సంక్రాంతి పండుగకు మరింత తియ్యదనాన్ని ఇస్తాయి. ఇంట్లో చేసిన అరిసెలు కుటుంబ సభ్యులకు, అతిథులకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తాయి. కనుక ఈ సంక్రాంతికి ఇంట్లోనే రుచికరమైన బెల్లం అరిసెలు తయారు చేసి పండుగను మరింత మధురంగా జరుపుకోండి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications