సూపర్ టేస్టీ 'బెండకాయ రోటి పచ్చడి'.. ఈజీగా ఇలా చేసుకోండి..!
బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెండకాయలో విటమిన్లు (సీ, కే, ఏ) తోపాటుగా, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం.. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెండకాయ.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. బెండకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే బెండకాయను ఫ్రై ,పులుసు, కర్రీ ఇలా అనేక రకాలుగా చేసుకుని తింటారు. అయితే పాతకాలం నాటి బెండకాయ రోటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా..? బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బెండకాయలు పావుకిలో తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి 15 నుంచి 20, టమాటా రెండు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె తగినంత, ధనియాలు రెండు టేబుల్ స్పూన్ లు, వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు, జీలకర్ర కొద్దిగా, చింతపండు కొద్దిగా తీసుకోవాలి.
బెండకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ ప్లేటులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నూనె పోసి బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలో మరికొంచెం నూనె పోసి టమాటా ముక్కలను వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ తీసుకుని అందులో వేయించిన ధనియాల మిశ్రమం, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి.

ఇప్పుడు అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. లేదా రోలు ఉంటే దాంట్లో పచ్చడి చేసుకోవాలి. రోటిలో అయితే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ బెండకాయ రోటి పచ్చడిని తాలింపు లేకుండా కూడా తినొచ్చు. తాలింపు కావాల్సిన వాళ్లు పెట్టుకోవచ్చు. సూపర్ టేస్టీ బెండకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే.
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications