బ్రౌన్ రైస్ Vs రెడ్ రైస్.. ఎవరికి ఏది మంచిది..!?
ప్రస్తుతం తెల్ల అన్నం వినియోగం తగ్గింది. ఈ స్థానంలో చాలా మంది బ్రౌన్ రైస్ తింటున్నారు. బ్రౌన్ రైస్‌ను రోజూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. బ్రౌన్ రైస్ తో పాటుగా రెడ్ రైస్ కూడా వినియోగంలోకి వచ్చింది. ఈ రైస్ కూడా ఆరోగ్య పరంగా అనేక లాభాలను అందిస్తుంది. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్ లోనూ అనేక పోషకాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిలో దేన్ని తినాలి.. ఎవరికి ఏ రైస్ మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ రెండు రైస్ లో ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి..ఎవరికి ఏది మంచిదో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
బ్రౌన్ రైస్, రెడ్ రైస్ రెండింటిలోనూ ఫైబర్ ఉంటుంది. కానీ రెడ్ రైస్‌లో ఇది కాస్త ఎక్కువ మోతా దులో ఉంటుంది. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ బ్రౌన్ రైస్ కన్నా రెడ్ రైస్‌కే తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ కన్నా రెడ్ రైస్ ఎక్కువ మేలు చేస్తుంది. కాబట్టి ఈ విషయంలోనూ రెడ్ రైస్ కు ప్రాధాన్యత ఇస్తారు. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇక ఈ రెండింటిలోనూ మెగ్నిషియం, ఫాస్ఫరస్ సమానంగానే ఉంటాయి. కానీ ఐరన్, జింక్ వంటి పోషకాలు మాత్రం రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. కనుక ఈ రెండు రకాల రైస్‌లలోనూ రెడ్ రైస్‌ను క్లియర్ విన్నర్ అని చెప్పవచ్చు. పోషకాల విషయానికి వస్తే రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. కాబట్టి బ్రౌన్ రైస్‌ను తింటున్నవారు ఈ రైస్‌ను తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ రైస్‌ను తింటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నిపుణుల సూచనలు
కాగా, రెడ్ రైస్‌ను తినడం వల్ల అధిక మొత్తంలో ఐరన్‌ను పొందవచ్చు. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది ఇక రెడ్ రైస్‌ను తింటే మెగ్నిషియం అధికంగా లభిస్తుంది. ఇది రక్త నాళాలను వెడల్పు చేస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ రైస్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌ను తినడం వల్ల క్యాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రైస్‌లోని మెగ్నిషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దీని వల్ల రాత్రి పూట నిద్రలో కాలి పిక్క లు పట్టుకుపోవడం కూడా తగ్గుతుంది. రెడ్ రైస్‌ను తింటుంటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ రైస్‌లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా రెడ్ రైస్ వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి. కనుక బ్రౌన్ రైస్ తింటున్నవారు ఈ రైస్‌ను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోండి. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు. తెల్ల అన్నం తగ్గించి బ్రౌన్ రైస్ తీసుకుంటున్న వారు తరచూ ఈ తరహా రెడ్ రైస్ తీసుకోవటం ద్వారా ఆరోగ్య కరంగా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications