గుడ్డులోని పచ్చసొన vs తెల్లసొన, రెండింటిలో ఎవరికి ఏది మంచిది..!?
గుడ్డు పోషకాల గని. ప్రొటీన్లు పుష్కలంగా అందించే ఏకైక ఆహారం. చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకుంటూ ఉంటారు. ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం, వాటిని రోజూ తినడం చాలా ఆరోగ్యకరమైన ఎంపిక. అయితే చాలా మంది మొత్తం గుడ్లను తినరు. గుడ్డులోని పచ్చసొన భాగాన్ని తినకుండా ఉంటారు. ఇంకొంతమంది గుడ్డులోని తెల్ల భాగాన్ని మాత్రమే తింటారు. ఈ రెండింటిలో ఎవరు ఏది తినాలి.. ఏది ఆరోగ్యానికి ప్రయోజనకరం అనే అంశం పైన అనేక రకాలైన సందేహాలు ఉన్నాయి. అయితే, ఈ రెండింటి గురించి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
మొత్తం గుడ్డులో విటమిన్ ఎ, డి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కళ్లకు, ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం. ఇందులోని విటమిన్ B12, ఫోలేట్ లక్షణాలు ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, మెదడు మెరుగైన పనితీరుకు సహాయపడతాయి. ఐరన్, జింక్ గుడ్డులో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఖనిజాలు ఆక్సిజన్ రవాణాలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు అభివృద్ధికి, కాలేయం సక్రమంగా పనిచేయడానికి గుడ్లలో ఉండే కోలిన్ చాలా అవసరం.

గుడ్డ తెల్లసొనలో ఫ్యాట్ శాతం ఉండదు. ఇది మాత్రమే తినేవారికి 17 కెలొరీలు లభిస్తాయి. ఎగ్ వైట్ తింటే విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు గుడ్డులోని తెల్లసొనలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లావిన్ ఉంటుంది. ఇది ఎనర్జీ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడుతుంది. క్యాలరీలను తక్కువగా తీసుకోవాలని కోరుకునేవారికి తెల్లసొన ఆరోగ్యకరమైన ఎంపిక.
గుడ్డులోని తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని ప్రయత్నించే వారికి ఎగ్ బెస్ట్ ఛాయిస్. గుడ్డు పచ్చసొనలో గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మంచి మొత్తంలో ప్రోటీన్‌తో పాటు గుడ్డు పచ్చసొనలో ఒమేగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను అందిస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో రిబోఫ్లేవిన్, విటమిన్లు, విటమిన్ బి-12 వంటి పోషకాలు ఉంటాయి.
ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. గుడ్డు పచ్చసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీరానికి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కావడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇది శక్తి స్థాయిలను పెంచడానికి, కండరాలను నిర్మించడానికి సహాయపడుతుంది. ఒక గుడ్డులో దాదాపు 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది పచ్చసొనలో మాత్రమే కనిపిస్తుంది. కాగా, పచ్చ సొన తీసుకోవటం పైన వయసు మళ్లిన వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆహారంలో చేర్చుకోవటం మంచిది.
-
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications