నోరూరించే స్వీట్లతో మహా డేంజర్- తినే ముందు జర ఆలోచించండి
తీపి పదార్థాలను చూడగానే చాలామందికి నోరూరుతుంది. లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది. మితిమీరిన చక్కెర పరిమాణాన్ని వినియోగించడం వల్ల మన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావం గురించి పెద్దగా పట్టించుకోరు. టీ, కాఫీలోనూ మరింత ఎక్కువగా చక్కెరను కలుపుకొని తాగేవారిని మనం చూసే ఉంటాం. మోతాదుకు మించిన చక్కెర శరీరంలోకి చేరడం వల్ల సంభవించే దుష్పరిమాణాలు తెలిస్తే.. రోజూ తీపి పదార్థాలను తినాలనే సాహసం ఎవరూ చేయకపోవచ్చు.
చక్కెర కంటే బెల్లం వినియోగమే మంచిదంటూ నిపుణులు చెబుతుంటారు. దీనికి కారణం- చక్కెరతో పోల్చుకుంటే బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉండటమే. చక్కెర అనేది ఒక రకమైన విషంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అనేక వ్యాధులకు కారణమని శాస్త్రీయబద్ధంగా నిరూపితమైంది కూడా. మన రోజువారీ దినచర్యల్లో భాగంగా చక్కెర వినియోగం అనేది 10 శాతానికి మించకూడదని నిపుణులు సూచిస్తుంటారు. రోజువారీ దినచర్యలో 10 శాతం పరిమాణం వరకు చక్కెను వినియోగించుకోవచ్చని పేర్కొంది.

చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. సల్ఫర్ ఎందులో వాడతారో మనకు తెలుసు కదా? బాణసంచా తయారీలో దీన్ని వాడుతుంటారు. సల్ఫర్..ఓ రసాయన మూలకం. అది మన శరీరంలోకి వెళ్లిన తరువాత.. దాన్ని ప్రక్షాళన చేయడం చాలా కష్టం. అనారోగ్యానికి దారి తీసే కొలెస్ట్రాల్ స్థాయిని ఇది పెంచుతుంది. కొలెస్ట్రాల్ అనేది పెరిగితేల గుండెపోటుకు అది దారి తీస్తుంది. చక్కెర మన శరీర బరువును పెంచుతుంది. ఊబకాయానికి కారణమౌతుంది.
చక్కెర బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది. మెదడుపై ఓ రకమైన దుష్ప్రభావాన్ని ఇది చూపుతుందని శాస్త్రీయ బద్ధంగా నిరూపితమైనట్లు నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు ఉన్న ప్రధాన లక్షణం.. మనకు తీపి తెలియజేయడం. అందులో సుక్రోజ్ శాతం అధికంగా ఉండటం వల్లే దాని తీపి అనేది మనకు తెలుస్తోంది. సుక్రోజ్‌ను మాత్రం మనుషులు జీర్ణం చేసుకోవడం కష్టం. అది అంత సులువుగా జీర్ణం కాబోదు. జంతువుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది.
చక్కెర తయారీ ప్రక్రియలో 23 హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర. కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది. పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం. సాధ్యమైనంతవరకు చక్కెరను వదిలివేసి, స్వచ్ఛమైన బెల్లం తినడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. అనేక రసాయనాలతో కలిగే పదార్థం కావడం వల్ల చక్కెర వినియోగాన్ని వీలైనంత వరకూ దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దాని స్థానంలో స్వచ్ఛమైన బెల్లాన్ని వినియోగించాలని, దానివల్ల ఐరన్ శాతం పెరుగుతుందని అంటున్నారు.
-
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications