హైదరాబాదీ మిర్చి కా సాలన్.. ఇలా చేస్తే అదిరిపోద్ధంతే!
మనం రకరకాల కూరలను వండుకుంటూ ఉంటాం. అటువంటి వంటలలో హైదరాబాద్ మిర్చి కా సాలన్ చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా బిర్యానీ కోసం తయారు చేసే ఈ ప్రత్యేకమైన కూర, బగార రైస్ తో కూడా తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో తయారు చేసే ఈ గ్రేవీ ఎలా చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ మిర్చి కా సాలన్ తయారీ విధానం ఏమిటి అనేది తెలుసుకుందాం.
హైదరాబాదీ మిర్చి కా సాలన్ .. చాలా స్పెషల్
పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలలో వెజ్ బిర్యానీ లేదా నాన్ వెజ్ బిర్యానీలను తయారు చేస్తారు. అలా తయారు చేసిన బిర్యానీలను మిర్చి కా సాలన్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చి మిర్చి, నట్స్ గ్రేవీ, చింతపండు మరియు మసాలాలతో తయారు చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇక హైదరాబాద్ స్టైల్ లో మిర్చి కా సాలన్ ఎలా తయారుచేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు
పెద్ద పచ్చిమిర్చి – 8 నుంచి 10 (తక్కువ కారం గలవి)
నూనె – 4 టేబుల్ స్పూన్లు
వేరుశనగలు – 3 టేబుల్ స్పూన్లు
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – ¼ టీ స్పూన్
ఉప్పు – తగినంత
కారం పొడి – 1 టీ స్పూన్ (రుచికి తగ్గట్టు)
ధనియాల పొడి – 1½ టీ స్పూన్లు
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
నీరు – అవసరానికి
పచ్చిమిర్చితో మిర్చి కా సాలన్
పెద్ద పచ్చిమిర్చికి మధ్యలో గాటు పెట్టి గింజలు కావాలంటే తీసి పక్కన పెట్టుకోండి. ఒక పాన్‌లో వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరిని తక్కువ మంటపై వేయించి చల్లారాక పేస్ట్‌గా గ్రైండ్ చేయండి. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.
ఇలా చేస్తే మిర్చి కా సాలన్ సూపర్ టేస్ట్
తరువాత అందులో గాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడిని వేసి పచ్చిమిరపకాయలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఆపై అందులో గ్రైండ్ చేసుకున్న పేస్టును యాడ్ చేసి, కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి.
ఇలా తింటే బాగుంటుంది.. ట్రై చెయ్యండి
అందులో గరం మసాలా, ధనియాల పొడిని యాడ్ చేయాలి. మిర్చి కా సాలన్ పూర్తిగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే మిర్చి కా సాలన్ రెడీ అయినట్టే. దీనిని బిర్యానీతో కానీ, బగారా రైస్ తో కానీ. రోటీలతో కానీ తింటే చాలా బాగుంటుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications