గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి, ఎప్పుడు తాగకూడదు..!?
గ్రీన్ టీ ఆరోగ్యానికి ప్రయోజనకరం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీలోని కెఫిన్ మరియు కాటెచిన్స్ కలయిక జీవక్రియను పెంచ డానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. చాలామంది ఉదయం నిద్రలేచాక గ్రీన్ టీతోనే రోజును ప్రారంభిస్తారు. కానీ, ఖాళీ కడుపుతో ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనం ఉందా అనే చర్చ ఉంది. గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి? ఎప్పుడు తాగకూడదో అనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
గ్రీన్ టీ. ఈ మధ్య కాలంలో పలువురు గ్రీన్ టీ ఎక్కువగా వినియోగిస్తున్నారు. గ్రీన్ టీలో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ పద్ధతి అనుసరించే వారిలో కడుపు సహజ జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు రెండే. భోజనం లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత మాత్రమే ఈ పానీయం తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్యుత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సి డెంట్లను అందుతాయి. శక్తి స్థాయిలను పెరుగుతాయి. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగినా జీర్ ణవ్యవస్థకు ప్రయోజనకరమని చెబుతున్నారు.

సాధారణంగా గ్రీన్ టీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు సమస్యల త్వరగా నివారించి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. సాయంత్రం వేళల్లో శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే గ్రీన్ టీ తాగితే తక్షణమే ఎనర్జిటిక్ గా మారతాయి. ఇది శరీరంలో సహజ శక్తిని పెంపొందిస్తుంది. కొంతమంది వ్యాయామానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తాగడానికి ఇష్ట పడతారు. ఎందుకంటే ఇది పనితీరు స్థాయిలను మెరుగుపరచడానికి, శక్తిని పెంచడానికి సహాయ పడుతుంది. అయితే, సాధారణంగా రోజుకు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీ తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నొప్పి, నిద్రలేమి, కాలేయంపై ఒత్తిడి వంటి పలు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని గ్రీన్ టీ ను తీసుకుంటే సమస్య ఉండదని చెబుతున్నారు.
-
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications